పలు రాష్ట్రాల్లో అధునాతన టెక్నాలజీ వినియోగంతో, జే ఫార్మ్ లెర్నింగ్ సెంటర్లు నిర్వహిస్తూ,వ్యవసాయంలో ఉత్పత్తి పెంచేందుకు ఆధునిక పరికరాల వినియోగం, ఏ పంట వెయ్యాలి, వాడాల్సిన విత్తనాలు,ఫెర్టిలైజర్స్, ఇలా ఉత్పత్తి వచ్చే వరకూ అన్ని విషయాల్లోనూ రైతులకు సలహాలు, శిక్షణ ఇస్తున్నాయి జే ఫార్మ్ లెర్నింగ్ సెంటర్ల ప్రతినిధులు ఈ రోజు మంత్రి లోకేష్ తో సమావేశం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో జే ఫార్మ్ లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. రైతులకు ఆదాయం పెంచే విధంగా నూతన యాప్ రూపొందించిన జే ఫార్మ్. ఊబర్ మోడల్ లో వ్యవసాయం కోసం వినియోగించే ట్రాక్టర్లు, ఇతర పరికరాలను అద్దెకు ఇచ్చే విధంగా యాప్ రూపకల్పన చేసారు.
ప్రకాశం,చిత్తూరు జిల్లాలో జే ఫార్మ్ ఇప్పటికే పైలెట్ ప్రాజెక్ట్ చేపట్టింది. రైతులు సొంతంగా ట్రాక్టర్లు,ఇతర వ్యవసాయ పరికరాలు కొనాల్సిన అవసరం లేకుండా,యాప్ లో రిజిస్టర్ అవ్వడానికి ఎటువంటి ఖర్చు లేకుండా, ఇతర రైతుల నుండి పరికరాలు అద్దెకు తీసుకునే అవకాశం ఉంటుంది. జే ఫార్మ్ యాప్ కి ప్రకాశం,చిత్తూరు జిల్లాలో రైతుల నుండి మంచి స్పందన వచ్చింది. పైలెట్ ప్రాజెక్ట్ ద్వారా రెండు జిల్లాల్లో యాప్ వినియోగించిన రైతులకు అదనపు ఆదాయం వచ్చింది. ప్రభుత్వ సహకారం అందిస్తే 13 జిల్లాల్లో జేఫార్మ్ సేవలు విస్తరిస్తాం.
టఫే ట్రాక్టర్ల కంపెనీ సిఓఓ టిఆర్ కేశవన్, కంపెనీ ప్రతినిదులతో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. టఫే ప్రపంచంలోనే మూడోవ అతిపెద్ద ట్రాక్టర్ల తయారీ కంపెనీ. మంత్రి లోకేష్ మాట్లాడుతూ "టెక్నాలజీ వినియోగంలో అందరికంటే ముందు ఉన్నాం. తక్కువ వర్షపాతం ఉన్నా వ్యవసాయ రంగంలో వృద్ధి సాధించాం. నూతన పద్ధతులు,న్యాచురల్ ఫార్మింగ్,నీటి సంరక్షణ పద్ధతులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలు,టెక్నాలజీ అనుసంధానం కోసం నాస్కామ్ తో కలిసి వ్యవసాయంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసాం. తక్కువ ఖర్చుతో రైతుల ఉత్పత్తి పెంచేందుకు టెక్నాలజీ ముఖ్యపాత్ర పోషిస్తుంది. డేటా అనలిటిక్స్ ద్వారా దేశ వ్యాప్తంగా పంటలకు ఉన్న డిమాండ్,ధరల్లో మార్పులు,ఎటువంటి పంటలు వేస్తే అధిక లాభాలు వస్తాయి...ఇలా అనేక విషయాలు ముందుగానే తెలుసుకొని రైతులకు సరైన సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. టఫేకి ప్రభుత్వం తరపున పూర్తి సహకారం అందిస్తాం. జే ఫార్మ్ లెర్నింగ్ సెంటర్ ఏర్పాటు, 13 జిల్లాలో యాప్ అమలుకు కావాల్సిన పూర్తి సహకారం అందిస్తాం" అని లోకేష్ అన్నారు..