రైల్వే జోన్‌పై కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌తో టీడీపీ నేతల సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో అనూహ్యంగా బీజేపీ ఎంపీలు జీవీఎల్‌ నరసింహరావు, హరిబాబు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి స్పందించాల్సిన అంశాలపై జీవీఎల్‌ మాట్లాడటం, టీడీపీ నేతలు అవాస్తవాలు చెబుతున్నారని చెప్పడంతో వివాదం ఏర్పడింది. మంగళవారం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతృత్వంలో ఎంపీలు, ముగ్గురు రాష్ట్ర మంత్రులు, ఉత్తరాంధ్ర జిల్లాల కు చెందిన 25 మంది టీడీపీ ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు ఢిల్లీ రైల్‌ భవన్‌లో పీయూష్‌ గోయల్‌తో సమావేశమయ్యారు.

lokesh 08082018 2

పీయూష్‌ ఆర్థిక శాఖను కూడా చూస్తున్న నేపథ్యంలో.. వెనుకబడిన జిల్లాలకు రూ.350 కోట్లు ఇచ్చి వెనక్కి తీసుకున్న అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంలో బీజేపీ ఎంపీ జీవీఎల్‌ జోక్యం చేసుకొని టీడీపీ నేతలు అవాస్తవాలు చెబుతున్నారని ఆరోపించా రు. దాంతో టీడీపీ నేతలు ఒక్కసారిగా ఆగ్రహించారు. సీట్లలో నుంచి లేచి జీవీఎల్‌పై మండిపడ్డారు. ‘‘ఆంధ్రప్రదేశ్‌ గురించి మాట్లాడడానికి మీరెవరు? అసలు ఏపీ గురించి ఏం తెలుసునని మాట్లాడుతున్నారు? మేం కేంద్రమంత్రిని అడుగుతుంటే మీరెందుకు స్పందిస్తున్నారు? అసలు మీరెందుకు వచ్చారు?’’ అని జీవీఎల్‌ను నిలదీశారు. సమావేశంలో ఎవరు పాల్గొనాలో మీరెలా నిర్ణయిస్తారని జీవీఎల్‌ ఎదురుదాడికి దిగారు.

lokesh 08082018 3

సుజనా చౌదరి కల్పించుకుని.. ‘‘మేం కేంద్ర మంత్రికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాము. ఆయనే మాకు దీనిపై వివరణ ఇస్తారు. మధ్యలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు. ఏ హోదాతో మాట్లాడుతున్నారు. మీకు మాట్లాడే అర్హత లేదు’’ అని జీవీఎల్‌కు సూటిగా చెప్పారు. ‘‘ఆంధ్రకు ద్రోహం చేయాలని చూస్తే మిమ్మల్ని రాష్ట్రంలో తిరగనివ్వరు’’ అని కళా వెంకట్రావు పేర్కొనగా... ‘ను వ్వేం చేస్తావ్‌’ అని జీవీఎల్‌ ప్రశ్నించారు. తాను మాట్లాడి తీరతానని తేల్చిచెప్పారు. దీంతో టీడీపీ నేతలు మరింత మండిపడ్డారు. ‘యూపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మీకు... ఏపీతో ఏం సంబంధం?’ అని ప్రశ్నించారు.

lokesh 08082018 4

అయితే, ఇదే విషయం పై ఐటి శాఖా మంత్రి లోకేష్ ట్వీట్ చేసారు. "మన ఎంపీలు జోన్ ఆవశ్యకత గురించి రైల్వే మంత్రికి చెప్తుంటే, జీవీఎల్ వెనకేసుకుని వచ్చారని, రాష్ట్రానికి అన్యాయం చెయ్యాలని చూస్తున్నారని అన్నారు. నేను కచ్చితంగా చెప్తున్నా, మన రాష్ట్రానికి అన్యాయం చేసిన వారి పేర్లు, ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతాయి" అని ట్వీట్ చేసారు. "When TDP MPs demanded Railways Minister @PiyushGoyal for a Zone in Vizag, @GVLNRAO argued on his behalf and did not let him answer the questions posed by us. Mark my words: the names of these BJP Leaders who betrayed the State will be written in history books as traitors!"

Advertisements

Advertisements

Latest Articles

Most Read