రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పడుతున్న శ్రమ తెలుగు ప్రజల గుండెల్లో పదిలంగానే ఉంటుందని ఐటీ మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలకు కౌంటర్ గా ట్వీట్ చేసారు. ‘68 ఏళ్ల వయసులో సీఎం చంద్రబాబు 24 ఏళ్ల యువకుడిలా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తున్నారు. అందుకోసం ఆయన్ను ద్వేషిస్తాం అంటే ద్వేషించండి. కానీ మీరు రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని.. అందుకోసం సీఎం పడుతున్న శ్రమని తెలుగు ప్రజల గుండెల్లో నుంచి తొలగించలేరు’ అని ట్వీట్ చేసారు. ‘ప్రపంచంలోనే ఉత్తమ కంపెనీలు విశాఖకు వస్తోండటంతో మన యువతకు ఉద్యోగాలు లభిస్తుంటే కొన్ని దుష్టశక్తులు ప్రజల్లో అపోహలు సృష్టిస్తూ ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి’ అని విమర్శించారు. ‘ఎవరెన్ని కుయుక్తులు పన్నినా వాటిని ప్రజలు అర్థం చేసుకుంటున్నారు’ అని లోకేశ్ పేర్కొన్నారు.
లోకేష్ గతంలో కూడా, పవన్ ను ఉద్దేశిస్తూ ట్వీట్ చేసారు "రాష్ట్ర విభజన తరువాత కనీస మౌలిక వసతులు కూడా లేని పరిస్థితిని అధికమించి ఇప్పుడు ఐటీలో 24వేలు, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో 18వేల ఉద్యోగాలు కల్పించాం. మరో 65వేల ఉద్యోగాలు త్వరలోనే రాబోతున్నాయని, వీటికి సంబంధించి భూమి కేటాయింపులు, మౌలిక వసతుల కల్పన పూర్తి అవుతుంది. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో 2లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని కట్టుబడి ఉన్నాను.. మీ రాజకీయ ప్రయోజనాల కోసం బురద రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చెయ్యొద్దని, యువతి, యువకుల పొట్టకొట్టదని మిమ్మల్ని కోరుతున్నాను. ప్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి కంపెనీలు చంద్రబాబు గారి పై ఉన్న నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకువచ్చారు. కనీస ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేసి రాష్ట్రానికి వచ్చే కంపెనీలను భయపెట్టి లక్షల మంది యువతీ, యువకుల భవిష్యత్తుని దెబ్బతీయకండి" అని ట్వీట్ చేశారు.
విశాఖపట్నంలో వచ్చిన పెద్ద కంపెనీలు ఇవే.. వీటి పైనే పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారు. 1.ఫ్రాంక్లిన్ టెంపుల్టన్(ప్రపంచంలోనే ఉత్తమ ఫింటెక్ కంపెనీల్లో ఒక్కటి).. 2.కాన్డ్యూయెంట్.. 3.ఏఎన్ఎస్ఆర్(గ్లోబల్ ఇన్ హౌస్ సెంటర్ కంపెనీ).. 4.గూగుల్ ఎక్స్(ప్రపంచంలో అమెరికాలో తప్ప ఇంక ఎక్కడా కార్యాలయం లేని కంపెనీ) మారు మూల ప్రాంతాలకు సైతం ఎఫ్ సాక్ టెక్నాలజీ తో ఇంటర్నెట్ సదుపాయం.. విశాఖపట్నంలో ఎంతో కాలంగా ఖాళీగా ఉన్న హిల్ 1,2 ఇప్పుడు ఐటి కంపెనీలతో నిండిపోయాయి.. మిలీనియం టవర్స్ నిర్మాణం శరవేగంగా జరుగుతుంది.. కాపులపాడ లో ఐటి పార్క్ ఏర్పాటుకు పనులు ప్రారంభం అయ్యాయి..