అసత్య ఆరోపణలు చేసి రాష్ట్రానికి వచ్చే కంపెనీలను భయపెట్టి లక్షల మంది యువతీ, యువకుల భవిష్యత్తుని దెబ్బతీయకండి అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాష్ట్రం మంత్రి లోకేష్ ట్విట్టర్లో పేర్కొన్నారు. శనివారం రాత్రి ట్విట్టర్లో స్పందిస్తూ "రాష్ట్ర విభజన తరువాత కనీస మౌలిక వసతులు కూడా లేని పరిస్థితిని అధికమించి ఇప్పుడు ఐటీలో 24వేలు, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో 18వేల ఉద్యోగాలు కల్పించాం. మరో 65వేల ఉద్యోగాలు త్వరలోనే రాబోతున్నాయని, వీటికి సంబంధించి భూమి కేటాయింపులు, మౌలిక వసతుల కల్పన పూర్తి అవుతుంది. ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో 2లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని కట్టుబడి ఉన్నాను.. మీ రాజకీయ ప్రయోజనాల కోసం బురద రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చెయ్యొద్దని, యువతి, యువకుల పొట్టకొట్టదని మిమ్మల్ని కోరుతున్నాను. ప్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి కంపెనీలు చంద్రబాబు గారి పై ఉన్న నమ్మకంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకువచ్చారు. కనీస ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేసి రాష్ట్రానికి వచ్చే కంపెనీలను భయపెట్టి లక్షల మంది యువతీ, యువకుల భవిష్యత్తుని దెబ్బతీయకండి" అని ట్వీట్ చేశారు.
నిజానికి పవన్ కళ్యాణ్ చేసేవి అన్నీ రాజకీయ ఆరోపణలే. ఐటి అభివృద్ధి, వికేంద్రీకరణ జరుగుతూ, ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఐటి రంగం అభివృద్ధి కేవలం ఒకే ప్రాంతంలో జరగకూడదు, అన్ని ప్రాంతాల్లోనూ ఐటి అభివృద్ధి జరగాలి అనే ఉద్దేశంతో మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో నాలుగు ఐటి క్లస్టర్లు ఏర్పాటు చెయ్యాలి అని లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖపట్నం, అమరావతి, తిరుపతి, అనంతపురం లో ఐటి క్లస్టర్లు ఏర్పాటు చెయ్యాలి అని నిర్ణయించారు.కేవలం పెద్ద కంపెనీలు మాత్రమే కాదు మధ్య,చిన్న తరహా కంపెనీలు కూడా ఉంటేనే పూర్తి స్థాయి లో ఐటి రంగం అభివృద్ధి చెందుతుంది అని అందరికి సమాన ప్రాధాన్యత కల్పించారు.
విశాఖపట్నం ... తీసుకొచ్చిన వివిధ పాలసీల వలన అనేక పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నాయి.. 1.ఫ్రాంక్లిన్ టెంపుల్టన్(ప్రపంచంలోనే ఉత్తమ ఫింటెక్ కంపెనీల్లో ఒక్కటి).. 2.కాన్డ్యూయెంట్.. 3.ఏఎన్ఎస్ఆర్(గ్లోబల్ ఇన్ హౌస్ సెంటర్ కంపెనీ).. 4.గూగుల్ ఎక్స్(ప్రపంచంలో అమెరికాలో తప్ప ఇంక ఎక్కడా కార్యాలయం లేని కంపెనీ) మారు మూల ప్రాంతాలకు సైతం ఎఫ్ సాక్ టెక్నాలజీ తో ఇంటర్నెట్ సదుపాయం.. విశాఖపట్నంలో ఎంతో కాలంగా ఖాళీగా ఉన్న హిల్ 1,2 ఇప్పుడు ఐటి కంపెనీలతో నిండిపోయాయి.. మిలీనియం టవర్స్ నిర్మాణం శరవేగంగా జరుగుతుంది.. కాపులపాడ లో ఐటి పార్క్ ఏర్పాటుకు పనులు ప్రారంభం అయ్యాయి..
అమరావతి... 1.హెచ్ సిఎల్ కంపెనీ రాక తో అమరావతి ఐటి ముఖ చిత్రం మారిపోబోతుంది.అధునాతన టెక్నాలజీల పరిశోధన మరియు అభివృద్ధి ఇక్కడ జరగబోతుంది.. 2.పై డేటా సెంటర్.టియర్ ఫోర్ డేటా సెంటర్ ఏర్పాటు అయ్యింది.. సుదీర్ఘ కాలం ఖాళీగా ఉన్న మేధా టవర్స్ లోకేష్ స్పీడ్ తో ఫుల్ అయ్యింది.ఇప్పడు ఫేస్ 2 నిర్మాణం ప్రారంభం అయ్యింది... మంగళగిరి మినీ ఐటి హబ్ గా మారుతుంది ఫై కేర్,ఇన్వికాస్ సహా అనేక కంపెనీలు మంగళగిరిలో కొలువుతీరాయి. ఏపీఎన్ఆర్టి సహకారంతో విజయవాడ,గుంటూరు,విశాఖపట్నం లో ఇండ్ వెల్ టవర్స్,మేధా టవర్స్,కే బిజినెస్ స్పేస్,ఫై కేర్,ఎన్ఆర్టి టెక్ పార్క్ భవనాల్లోకి ఐటి కంపెనీలు వచ్చాయి..
తిరుపతి... 1.జోహో తన కార్యకలాపాలను ప్రారంభించింది..అనంతపురం...బెంగుళూరు సిటి కి దగ్గరగా అనంతపురం జిల్లాలో బెంగుళూరు ప్లస్ ప్లస్ పేరుతో ఐటి పార్క్ ఏర్పాటు చేయబోతున్నారు.. ఎలక్ట్రానిక్స్...2014 లో రాష్ట్ర విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్ లో ఎలక్ట్రానిక్స్ తయారీ లేనే లేదు.మంత్రి గా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఏపి ఎలక్ట్రానిక్స్ పాలసీని పెద్ద ఎత్తున ప్రచారం చేసారు.దేశ వ్యాప్తంగా తిరుగుతూ అనేక ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల ప్రతినిధులు, అధిపతులతో భేటీ అయ్యారు.చెన్నై,బెంగుళూరు కారిడార్ ను సమర్థవంతంగా వినియోగిచుకుంటూ కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తున్నారు
రాష్ట్రానికి ఎలక్ట్రానిక్ కంపెనీలు... రాష్ట విభజన నాటికి ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఫోన్ కూడా తయారు కాలేదు.కానీ ఇప్పుడు దేశంలో తయారు అవుతున్న 10 ఫోన్లలో 2 ఆంధ్రప్రదేశ్ లో తయారు అవుతున్నాయి.కేవలం సెల్ ఫోన్లు మాత్రమే కాదు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్,ఆటో ఎలక్ట్రానిక్స్,డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ తయారీ రాష్ట్రంలో జరిగేందుకు మంత్రి నారా లోకేష్ అనేక చర్యలు తీసుకుంటున్నారు.. 1.ఫాక్స్ కాన్ కంపెనీ ప్రపంచంలోనే అతి పెద్ద ఫోన్ల తయారీ కంపెనీల్లో ఒక్కటి. అలాంటి కంపెనీని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర పోషించారు.ఒకే చోట 14 వేల మంది మహిళలు పనిచేస్తున్నారు.. 2.సెల్ కాన్ మొబైల్ తయారీ కంపెనీ.. 3.డిక్సన్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ... 4.కార్బన్ మొబైల్ తయారీ కంపెనీ.. 5.రిలయన్స్ తో సిఐఐ సమ్మిట్ లో కీలక ఒప్పందం...