సోషల్ మీడియా వేదికగా, ఒక పార్టీ వారు, మరో పార్టీ పైన ఎత్తుకు పై ఎత్తు వేయటం, సర్వ సాధారణం. సోషల్ మీడియాలో వైసీపీకి పైడ్ బ్యాచ్ ఉండటంతో, టిడిపి ఎప్పుడూ వెనుకబడే ఉంటుంది అనే అభిప్రాయం ఉంది. ప్రశాంత్ కిషోర్ వచ్చిన తరువాత, పేటీయం బ్యాచ్ తో వైసీపీ సోషల్ మీడియాలో బలోపేతం అయ్యింది. టిడిపికి సోషల్ మీడియా టీం ఉన్నా, అది కేవలం అఫీషియల్ హ్యండిల్స్ కే పరిమితం. టిడిపి అభిమానులు స్వచ్చందంగా పని చేస్తూ, వైసీపీ పేటీయం బ్యాచ్ ని ఎదుర్కుంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ప్రభుత్వం మీద వస్తున్న వ్యతిరేకతతో, సోషల్ మీడియాలో వైసీపీ పప్పులు ఉడకటం లేదు. ఫేక్ చేసినా వెంటనే దొరికిపోతున్నారు. ఇక గత రెండు రోజులుగా వివేక కేసు విషయంలో, టిడిపి దూకుడుకి వైసీపీకి ఎలా ఎదుర్కోవాలో కూడా తెలియటం లేదు. అప్పట్లో వైసీపీ నేతలు గుండెపోటు అంటూ చేసిన పెర్ఫార్మన్స్ దగ్గర నుంచి, ఆ తరువాత జరిగిన అనేక అంశాలు ఇప్పుడు టిడిపి సోషల్ మీడియా బయటకు తీసి ప్రచారంలో పెట్టింది. దీంతో అవి వైరల్ అయ్యాయి. అప్పట్లో వైసీపీ చేసిన ఫేక్ ప్రచారం అంతా ప్రజలకు అర్ధం అయ్యింది. ఇది ఇలా నడుస్తూ ఉండగానే, నిన్న లోకేష్ ఒక ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ చూసి వైసీపీ నేతలు గిలగిలా కొట్టుకుంటున్నారు.

lokesh 17022022 2

అందులో లోకేష్ పుష్ప సీన్ వాడుతూ, గొడ్డలి మాదే, బాబాయ్ మావాడే, వేసింది మేమే, మేము మేము వేసుకుంటే మీకు ఎందుకు అనే విధంగా ఉన్న డైలాగ్స్ తో, వీడియో ఒకటి రిలీజ్ చేసారు. గతంలో ఏ పాపం తెలియకపోయినా, తమ పై నిందలు వేసారని, చంద్రబాబు నాయుడు స్థాయి వ్యక్తి పై విషం చిమ్ముతూ, సాక్షి పేపర్ లో, వేసిన నారాసుర చరిత్ర అనే కధనాలు, ఇవన్నీ లోకేష్ చెప్తూ, ఇప్పుడు సిబిఐ వేసింది అబ్బాయే అని చార్జ్ షీట్ లో అనుమానం వ్యక్తం చేసిందని గుర్తు చేస్తూ, వీడియో పోస్ట్ చేసారు. ఈ వీడియో చూసి, వైసీపీకి ఏమి చేయాలో అర్ధం కాక, ఇలా ఫేక్ వీడియోలు వేస్తావా అంటూ, లోకేష్ పై మండి పడుతున్నారు. అయితే గతంలో తాము వాస్తవం కాకపోయినా చేసిన చిల్లర ప్రచారాల గురించి మాత్రం మర్చిపోయారు. ఇక్కడ వాస్తవం ఉన్నది లోకేష్, అర్ధమయ్యే భాషలో చెప్పటంతో, వారికి ఏమి చేయాలో అర్ధం కాక, వైసీపీ నేతలు, సోషల్ మీడియా, లోకేష్ పైన విరుచుకు పడుతున్నారు. వైసీపీ వారికి, ఇప్పుడు బాధ తెలిసి వచ్చినట్టు ఉంది పాపం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read