ఈ నెల 17,18,19 తారీఖుల్లో, అమెరికాలో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్నా, కార్యక్రమాన్ని మంత్రి నారా లోకేశ్ రద్దు చేసుకున్నారు. వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలు అందించిన వారికి ఇచ్చే అత్యున్నత పురస్కారం వరల్డ్ ఫుడ్ ప్రైజ్.
18 వ తేదీన భారతదేశ వ్యవసాయ రంగం - టెక్నాలజీ అనుసంధానంతో దేశ వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పుల పై కీ నోట్ ప్రసంగం ఇవ్వాలి అని లోకేష్ కి ఆహ్వానం పంపింది వరల్డ్ ఫుడ్ ప్రైజ్. అయితే, ఈ పర్యటనకు వెళ్ళాల్సి ఉన్న లోకేహ్స్,
శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయక కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నందు వల్ల, పూర్తి స్థాయిలో గ్రామాలు కొలుకోని, సాధారణ స్థితికి వచ్చే వరకూ శ్రీకాకుళంలోనే ఉండాలి అని లోకేష్ నిర్ణయం తీసుకోవటంతో, ఈ పర్యటన రద్దు చేసుకున్నారు.
మరో పక్క నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అమ్మరవారికి పట్టు వస్త్రాలు సమర్పించటానికి శ్రీకాకుళం నుంచి విజయవాడ వచ్చారు. ఈ సందర్భంలో చంద్రబాబు కుటుంబ సమేతంగా, అమ్మవారిని దర్శించుకున్నా, ఆ సమయంలో కూడా లోకేష్ శ్రీకాకుళంలోనే ఉండిపోయారు. మందస డిఆర్డిఏ వెలుగు కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ రోజు నుంచి, గ్రామాల్లో ఉన్న రేషన్ షాపుల్లో కుటుంబానికి 25 కిలోల బియ్యం, నిత్యవసర సరుకులు, కూరగాయలు పంపిణీ జరగాలని, దానికి తగ్గ ఏర్పాట్లు చెయ్యాలని ఆదేశించారు. గ్రామాల్లో బియ్యం,నిత్యవసర సరుకుల పంపిణీ సులభంగా జరిగేలా ప్రత్యేక బృందాల ఏర్పాటు చేసారు.
అలాగే గ్రామాల్లో జరిగే సహాయ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అనుసంధానంతో బృందాలు ఏర్పాటు చేసారు. పంచాయతీ రాజ్,గ్రామీణాభివృద్ధి,గ్రామీణ నీటి సరఫరా,వ్యవసాయ శాఖ,రెవెన్యూ,ఉద్యాన పంటలు,పశు సంవర్ధక శాఖ మరియు ఇతర శాఖల క్షేత్ర స్థాయి సిబ్బందితో ప్రత్యేక బృందాలను దింపారు. గ్రామాల్లో సహాయక కార్యక్రమాలు, పంట నష్టం అంచనా అన్ని ఓకే సారి జరిగేలా బృందాలకు సూచనలు చేసారు లోకేష్. మందసం మండలం లోని 38 గ్రామాలు,244 నివాస ప్రాంతాల్లో మూడు పూటలా భోజనం ఏర్పాటులో ఎలాంటి లోపాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లోకేష్ ను, తుఫాను బాధితులను ఆదుకోవటానికి, మందసం మండల ఇంచార్జ్ గా చంద్రబాబు నియమించారు.