రాష్ట్రంలో బహిరంగసభలు నిర్వహించే ప్రతిపక్షాలు కట్టడి చేసేందుకు తెచ్చిన జీవోని మడిచి పెట్టుకోవాలంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోషల్మీడియా ద్వారా వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు ఇంట్లోంచి బయటకు రాకూడదని ఇంటి మీదే దాడి చేసినా ఆయనని ఆపలేకపోయారన్నారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల్ని దూరం చేయాలని కేంద్ర కార్యాలయాన్ని ధ్వంసం చేయించారని, అయినా తెలుగుదేశం కుటుంబసభ్యుల వెల్లువని అడ్డుకోలేకపోయాడన్నారు. అక్రమ అరెస్టులతో టిడిపిని భయపెట్టాలని చూసిన జగన్ రెడ్డి తెలుగుదేశం తెగువ చూసి వణికి చస్తున్నాడన్నారు. వైసీపీపై తీవ్రమైన ప్రజావ్యతిరేకత, తెలుగుదేశం పార్టీకి వెల్లువెత్తుతున్న ప్రజాదరణని చూసి ఓర్వలేకపోతున్న జగన్‌రెడ్డీ చీకటి జీవో తెచ్చారని ఆరోపించారు. టిడిపి సభలకి వెళ్తే పథకాలు రద్దు చేస్తామని బెదిరిస్తే మూలనున్న ముసలమ్మ కూడా బెదరడంలేదని ఎద్దేవ చేశారు. వైసీపీ రాక్షసపాలనకి చరమగీతం పాడేందుకు రాయలసీమ సమరశంఖం పూరించిందని, ఉత్తరాంధ్ర ఉప్పెనలా వైసీపీని ముంచెత్తనుందని, కోస్తా నీ సర్కారుకి కొరివి పెట్టనుందని హెచ్చరించారు. చంద్రబాబు సభలు అడ్డుకోవాలనే కుతంత్రమే కందుకూరు,గుంటూరు ఘటనలని సర్కారు తెచ్చిన చీకటి జీవోయే చెబుతోందన్నారు. అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రం అవుతుందనే చారిత్రక సత్యం మరిచిపోవద్దని, జీవోనీ మడిచిపెట్టుకోవాలని, జనసునామీని దమ్ముంటే తట్టుకోవాలని సవాల్ విసిరారు.
జగన్ తెచ్చిన జీవో మడిచి పెట్టుకోమంటూ లోకేష్ వార్నింగ్
Advertisements