తెలుగుదేశం ఎంపీలు నిరసనల ఉద్ధృతి పెంచటంతో పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లియ్యాయి... దీంతో పార్లమెంటు ఉభయ సభలు వాయిదా పడ్డాయి... లోక్ సభ నడిపే పరిస్థితి లేదని చెబుతూ, లోక్‌సభను సభాపతి సుమిత్రా మహాజన్ మార్చి 5 వరకు వాయిదా వేశారు. అలాగే రాజ్యసభ శుక్రవారం సాయంత్రం 2-30 గంటల వరకు వాయిదా పడింది... వాయిదా అనంతరం 12 గంటలకు సభ ప్రారంభం అయ్యింది... ఆ సమయంలో పలువురు సభ్యులు హడావిడిగా బిల్లులను ప్రవేశపెట్టారు...
బిల్లులు ప్రవేశపెట్టే సమయంలో కూడా తెలుగుదేశం ఎంపీలు నిరసనల తీవ్రతరం చేసారు.. నినాదాల మధ్యే, బిల్లులు ప్రవేశపెట్టగా, ఆ తరువాత సభను వాయిదా వేస్తున్నట్టు సుమిత్ర తెలిపారు. అదే విధంగా రాజ్యసభలో కూడా టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. సభా కార్యక్రమాలకు అంతరాయం కలగడంతో రాజ్యసభ ఛైన్మన్ వెంకయ్యనాయుడు సభను ఈ సాయంత్రం 2-30 గంటలకు వాయిదా వేశారు.
ఉభయసభలు ప్రారంభానికి ముందు గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీ శివప్రసాద్ వినూత్న వేషధారణతో నిరసన తెలిపారు. వెంకటేశ్వరస్వామి సాక్షిగా ఢిల్లీకి మించిన అమరావతిని నిర్మిస్తామంటూ మోదీ హామీ ఇచ్చారని... దీంతో మోదీని వెతుక్కుంటూ వెంకటేశ్వరస్వామి తనను ఆవహించి పార్లమెంట్‌కు వచ్చారంటూ వినూత్న ప్రదర్శన చేశారు. టీడీపీ, వైసీపీ ఎంపీలు దాదాపు 30 నిమిషాల పాటు నిరసన తెలిపారు..