మొన్న రైతు ఆత్మహత్యని చంద్రబాబుని అంటకట్టటం, నిన్న చింతమనేని కట్ పేస్టు వీడియో, ఈ రోజు చంద్రబాబు దేశ ద్రోహ వ్యాఖ్యలు అంటూ విష ప్రచారం.. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ, వైసీపీ, తన ఫేక్ ప్రచారానికి పదును పెట్టింది. లోటు పాండ్ లో బీహార్ బ్యాచ్ మొత్తం దిగి, ఈ దొంగ ప్రచారం ఉద్రతం చేసారు. ప్రతి రోజు తెలుగుదేశం పార్టీ ఈ బురద కడుక్కునే పరిస్థితి తెచ్చారు. రాను రాను, ఈ వికృత పోకడులు ఎక్కువ అయ్యే అవకాసం ఉంది. ఇది ఒక్కటే కాదు, రాజకీయంగా కూడా మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇదుగో ‘పూసపాటి’..అదిగో ‘పరిటాల’ మరియు గంటాలు వైకాపాలో చేరబోతున్నారని సోషల్‌మీడియాలో ప్రచురితమైన కథనాల వెనుక వైకాపా నేతల ప్రమేయం ఉందని బయటపడింది. గత మూడు,నాలుగు రోజుల నుంచి ఇంకేముంది ‘అశోక్‌గజపతిరాజు’ టిడిపిని వీడి విజయనగరం వైకాపా అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు.
పరిటాల సునీత ఆయన కుమారుడు వైకాపాలో చేరి ఆ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయడం ఖాయం. మంత్రి గంటా శ్రీనివాసరావు టిడిపిని వీడి వైకాపాలో చేరి ఆయన ఎంపిగా, ఆయన కుమారుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయమని కొంత మంది ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ఈ ముగ్గురికి టిడిపిని వీడే అవకాశం లేదు. అవసరమైతే రాజకీయాలకు దూరంగా ఉంటారే తప్ప..వైకాపాలో చేరే అవకాశమే లేదు. ‘అశోక్’ ఎటువంటి నాయకుడో..అందరికీ తెలుసు. తమ కుటుంబానికి ‘చంద్రబాబు’ పెద్దదిక్కు అని..ఆయన మాటే వేదవాక్కు అని ‘పరిటాల సునీత’ చెబుతున్నారు. గతంలో తాను తప్పుచేసి పార్టీని వీడానని..ఇప్పుడు అటువంటి పనిచేయనని మంత్రి గంటా శ్రీనివాసరావు అంటున్నారు. గంటా విషయం పక్కన పెడితే…పరిటాల కుటుంబం, అశోక్‌లు వైకాపాలో చేరతారని ప్రచారం చేయడం ఏమిటి..? జరిగే పనేనా..? ఈ ప్రచారం వెనుక సూత్రధారులు ఎవరు..? పాత్రధారులు..ఎవరు..?
దీనిపై ప్రభుత్వం విచారణ చేయలేదు. ఎవరెవరో ఏదో రాసుకుంటారు..అటువంటి పట్టించుకోవాల్సిన అవసరం లేదని ‘చంద్రబాబు’ చెప్పడంతో..ఆ ముగ్గురు నాయకులు ఈ కథనాలపై స్పందించడం లేదు. వైఎస్ ‘జగన్’ను తీవ్రంగా వ్యతిరేకించే ‘పరిటాల’, అశోక్‌లు వైకాపాలో ఏ కారణాలతో చేరతారనే దానిపై సంతృప్తికరమైన జవాబు రావడం లేదు. సోషల్‌మీడియాను ఆయుధంగా మలచుకుని..అనుకూలంగా ముందుకు వెళ్లాల్సిన వైకాపా నేతలు..అదుగో…టిడిపి నేతలు..మంత్రులు వైకాపాలో చేరబోతున్నారని.. దుప్రృచారం చేస్తూ వస్తున్నారు. దీనిపై మంత్రి సునీత పోలీసులకు ఫిర్యాదు చేయబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. అశోక్‌కు తెలుగు రాదు..అటువంటి కథనాలను ఆయన అసలు పట్టించుకోరు. తానేమిటో..చంద్రబాబుకు తెలుసు..తన ప్రజలకు తెలుసు..వారిద్దరికి మాత్రమే తాను చెబుతానని..మిగతా వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదంటున్నారు.