ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులకు హైకోర్టు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. దీని పై చాలా మంది ప్రభుత్వం పై దుమ్మెత్తి పోశారు. జగన్ మోహన్ రెడ్డి అండ్ కో సేఫ్ గా ఉంటూ, వాళ్ళు తీసుకునే తలతిక్క నిర్ణయాలకు అధికరులు బలి అవుతున్నారు అంటూ అనేక మంది తమ అభిప్రాయం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలన పై మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం సంచలన వ్యాఖ్యలు చేసారు. ఒకప్పుడు జగన్ మోహన్ రెడ్డి అన్నా అన్నా అని పిలిచే మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యంను, జగన్ మోహన్ రెడ్డి అవమానక రీతిలో బదిలీ చేసిన సంగతి తెలిసిందే. ఆయనకు ఘోర అవమానం జరిగిందని, గతంలో వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ కోర్ట్ తీర్ప పై మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం స్పందించారు. ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో, మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం జగన్ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసారు. హైకోర్టు అనేది ఒక ఉత్తర్వు ఇచ్చింది అంటే, అది పాటించి తీరాల్సిందే అని ఆయన అన్నారు. ఒక వేళ ఆ తీర్పు నచ్చక పోతే, పై కోర్టుకు అపీల్ కు వెళ్ళవచ్చు కానీ, రాజ్యాంగాన్ని ధిక్కరిస్తూ, ఏకంగా కోర్టు ఇచ్చిన ఆదేశాలను లెక్క చేయకుండా వదిలివేయటం కరెక్ట్ కాదని అన్నారు.
రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేసే ఐఏఎస్ అధికారులు కోర్టు తీర్పుని ధిక్కరించటం ఏ మాత్రం సమంజసం కాదని అన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు కూడా దీనికి బాధ్యత తీసుకోవాలని అన్నారు. అసలు ఏదైనా ఫైల్ మూవ్ అయ్యింది అంటే, అందులో అభ్యంతరాలు ఉంటే ఐఏఎస్ ఆఫీసర్లు తెలియ చేయాలని, ఐఏఎస్ ఆఫీసర్ అభ్యంతరం తెలిపితే, అప్పటికీ ఇవ్వాలి అనుకుంటే, మంత్రి ఆ నిర్ణయం తీసుకుని జీవో ఇవ్వాల్సిన వ్యవస్థ రావాలని, అప్పుడు మంత్రి బాధ్యుడు అవుతాడని అన్నారు. ఇలా ఇష్టం వచ్చినట్టు రాజ్యాంగాన్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టు కోర్టు తీర్పులు ధిక్కరిస్తే, పెట్టే సద్దుకుని అందరూ పోవాల్సిన పరిస్థితి వస్తుందని, రాష్ట్రపతి పాలన వస్తుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. తీర్పు నచ్చక పోతే అపీల్ కు వెళ్ళండి, అంతే కానీ తీర్పు అమలు చేయం, తీర్పు ఇచ్చిన జడ్జీలను తిట్టిస్తాం, కోర్టులను తిడతాం అంటే కుదరదు అంటూ, ప్రభుత్వం చేస్తున్న అరాచకం పై విరుచుకు పడ్డారు ఎల్వీ సుబ్రమణ్యం