జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను బదిలీ చేస్తూ, జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామంతో, ఒక్కసారిగా, ఐఏఏ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. ఏకంగా చీఫ్ సెక్రటరీని బదిలీ చెయ్యటంతో, ఐఏఎస్ వర్గాలే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా అవాక్కయ్యారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంను, హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌గా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్‌చార్జ్‌ సీఎస్‌గా నీరబ్‌ కుమార్‌ ప్రసాద్ కొనసాగేలా ఆదేశాలు జారీ చేశారు. అయితే, మొన్నటి ఎన్నికలు చివర్లో, చంద్రబాబుని ఇబ్బంది పెట్టటానికి, అప్పటి చీఫ్ సెక్రటరీని మార్చి, ఎల్వీ సుబ్రహ్మణ్యంను చీఫ్ సెక్రటరీని చేసారు. అప్పట్లో ఎన్నికలు కోడ్ ఉండగా, అన్నీ తానై నడిపిస్తూ, చంద్రబాబుని కూడా లెక్క చెయ్యకుండా, అప్పటి ప్రతిపక్షం వైసిపీకి అనుకూలంగా, ఆయన చేసారు అనే విమర్శలు వచ్చాయి.

jagan 04112019 1 2

అయితే ఇప్పుడు గత వారం రోజులుగా, చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంను, ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు మొదలయ్యాయి. అది కూడా సియం ప్రిన్సిపాల్ సెక్రటరీ, ప్రవీణ్ ప్రకాష్ వైపు నుంచి రావటంతో, అందరూ ఆశ్చర్యపోయారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం కి, జగన్ మోహన్ రెడ్డికి, ఎందుకు గ్యాప్ పెరిగిందో ఎవరికీ అర్ధం కాలేదు. వారం రోజులు క్రిందట, అర్దారాత్రి సమావేశం అయ్యి, ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉండే ప్రిన్స్‌పల్ సెక్రటరీ, జీఏడీ పొలిటికల్‌ సెక్రటరీగా ఉన్న ప్రవీణ్‌ ప్రకాష్‌, చీఫ్ సెక్రటరీకి కూడా షోకాజ్ నోటీసు ఇవ్వచ్చు అంటూ, బిజినెస్ రూల్స్ మార్చేసారు. అయితే, ఈ విషయం నిబంధనలకు విరుద్ధం అని, బిజినెస్ రూల్స్ మార్చేప్పుడు, గవర్నర్ ఆమోదం, చీఫ్ సెక్రటరీ ఆమోదం కావాలని అంటున్నారు.

jagan 04112019 1 3

ఈ వివ్వడం నడుస్తూ ఉండగానే, మొన్న జరిగిన క్యాబినెట్ సమావేశంలో, చీఫ్ సెక్రటరీ ఆమోదం లేకుండా, క్యాబినెట్ ఎజెండాగా, ఒక ఐటెం చేర్చటం పై, ప్రవీణ్ ప్రకాష్ పై విమర్శలు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని, తీవ్రంగా పరిగణించిన చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముఖ్యమంత్రి ప్రిన్స్‌పల్ సెక్రటరీ అయిన, ప్రవీణ్ ప్రకాష్ కు షోకాజ్ నోటీసు ఇచ్చి, వారం రోజుల్లో సమాధానం చెప్పాలని కోరారు. అయితే, ఏకంగా తన ప్రిన్స్‌పల్ సెక్రటరీకే, షోకాజ్ నోటీసు ఇవ్వటం పై, జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారని, అందుకే బదిలీ వేటు వేసారని తెలుస్తుంది. అయితే ఈ విషయం పై ఎల్వీ సుబ్రహ్మణ్యం ట్రిబ్యునల్ కు వెళ్లి, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పై సవాల్ చేసే అవకాసం ఉన్నట్టు తెలుస్తుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read