చీఫ్ సెక్రటరీగా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను రెండు రోజుల క్రితం ఉన్నట్టు ఉండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఎల్వీ సుబ్రమణ్యంను బాపట్లలోని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి సంస్థకు డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటూ జీవో జారీ చేసింది. దీని ప్రకారం ఈ రోజు, ఏపీ ప్రభుత్వ చీఫ్ సెక్రెటరి బాధ్యతలను ఎల్వీ సుబ్రమణ్యం, తాత్కాలిక చీఫ్ సెక్రటరీకి నీరబ్‌కుమార్‌కు ఈ రోజు అప్పగించారు. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నా, ఎల్వీ మాత్రం బాపట్లలో హెచ్‌ఆర్‌డీ డీజీగా బాధ్యతలు తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి షాక్ ఇస్తూ, ఆయన సెలవు పై వెళ్ళిపోయారు. ఎల్వీ సుబ్రహ్మణ్యం వచ్చే నెల 6వ తేదీ వరకు సెలవు పెట్టారు. అయితే ఎల్వీ ఇలా సెలవు పై వెళ్ళటం పై, రకరకాల వాదనలు వనిపిస్తున్నాయి. తనను అవమానకరంగా తప్పించారని, ఎల్వీ సుబ్రమణ్యం తన సన్నిహితులు వద్ద బాధపడుతున్నారని సమాచారం.
అయితే ఆయాన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం పై ట్రిబ్యునల్ కు వెళ్లి, ఏపి ప్రభుత్వం నిర్ణయం పై చాలెంజ్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. మరో పక్క, ఎల్వీ కేంద్రాని సర్వీస్ లకు కూడా వెళ్ళే అవకాసం ఉందని, దాని పై కూడా ఆయన కేంద్రంతో మాట్లాడుతున్నారని సమాచారం. చీఫ్ సెక్రటరీని ట్రాన్స్ఫర్ చేసిన తరువాత, ఉన్నట్టు ఉండి ఇలా ఎందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అనే అంశం పై, కేంద్రం కూడా ఆరా తీసినట్టు సమాచారం. ఇంటలిజెన్స్ ద్వారా, పూర్తీ వివరాలు సేకరించిందని, కేంద్రం కూడా ఏపి ప్రభుత్వ నిర్ణయం పై, చీఫ్ సెక్రటరీని ఇలా సాగనంపటం పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే, ఆయన్ను కేంద్ర సర్వీసుల్లోకి తీసుకునే అవకాశం ఉందని తెలుస్తుంది.
ముఖ్యంగా 5 నెలలు పైగా ఆయనకు సర్వీస్ ఉండగా, ఆయన్ను చీఫ్ సెక్రటరీ స్థానం నుంచి బదిలీ చెయ్యటం పై, కేంద్రం ఆగ్రహంగా ఉందని సమాచారం. ఎన్నికల సమయంలో, కేంద్రం అప్పుడు ఉన్న చీఫ్ సెక్రటరీని మార్చి, ఎల్వీ సుబ్రహ్మణ్యం ను పెట్టింది. అంటే, ఆయన కేంద్రానికి దగ్గరగా ఉన్నారని అక్కడే తెలుస్తుంది. మొదట్లో జగన్ కు, ఎల్వీకి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. అన్నా అన్నా అంటూ, జగన్ మోహన్ రెడ్డి, ఎల్వీని ఆకాశానికి ఎత్తే వారు. అయితే, ఏమైందో ఏమో కాని, జగన్ తన ప్రినిసిపాల్ సెక్రటరీ ద్వారా, ఎల్వీకి పొమ్మనలేక పొగ పెట్టారు. దానికి రియాక్ట్ అయిన ఎల్వీ, పరిధులు దాటటంతో, ప్రవీణ్ ప్రకాష్ కు షోకాజ్ నోటీసు ఇచ్చారు. దీంతో ఆయన మరుసటి రోజే బదిలీ అయిపోయారు. ఇప్పుడు సెలవు పై వెళ్ళిపోయారు.