ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ప్రతిపక్ష నేత, 14 ఏళ్ళు సియంగా చేసిన వ్యక్తి ఏమి జరిగిందో తేల్చండి అని డీజీపీకి ఉత్తరాలు రాస్తుంటే, మీరు ఆధారాలు ఇవ్వండి అంటూ ఎదురు చంద్రబాబుకే సమాధానం చెప్పటం కొత్త పరిణామం. తాజాగా చంద్రబాబుకి పోలీసులు నోటీసులు జారీ చేసారు. వారం రోజులు క్రితం, చిత్తూరు జిల్లాలో, ఓం ప్రాతాప్ అనే ఆటో డ్రైవర్, లిక్కర్ మాఫియాని ప్రశ్నిస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో పెట్టారు. అయితే ఆ వీడియోలో కొన్ని పరుష పదాలు కూడా వాడారు. ఆ వీడియో బాగా వైరల్ అయ్యింది. అయితే మరుసటి రోజే, ఓం ప్రతాప్ చనిపోయారు. ముందుగా ఆయన ఆ-త్మ-హ-త్య చేసుకుని చనిపోయారని చెప్పారు. అయితే తరువా కొద్ది సేపటికి అనారోగ్యం మృతి చెందారని అన్నారు. అయితే స్థానికంగా మాత్రం, కొంత మంది వ్యక్తులు అంతకు ముందు రోజు సాయంత్రం, తన ఇంటికి వచ్చి బెదిరించారని, భయపడి ఆ-త్మ-హ-త్య చేసుకున్నారు అంటూ కధనాలు వచ్చాయి. అయితే ఇందులో మంత్రి పెద్ది రెడ్డి హస్తం ఉంది అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. అలాగే స్థానిక ఎంపీ రెడ్డప్ప హస్తం కూడా ఇందులో ఉంది అంటూ తెలుగుదేశం పార్టీ ఆరోపించింది.
మంత్రి పెద్దిరెడ్డి దీని వెనుక ఉన్నారని, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డీజీపీకి లేఖ రాసారు. అలాగే ఓం ప్రతాప్ ఫోన్ చూస్తే ఎవరు ఫోనులు చేసి బెదిరించింది తెలిసిపోతుందని లేఖలో రాసారు. అంతే కాదు, మృతదేహంకి పో-స్ట్ మా-ర్టం చెయ్యాలని కోరారు. అయితే అనుమానాస్పద మృ-తి అయినా, పోలీసులు పో-స్ట్ మా-ర్టం చెయ్యకపోవటంతో తెలుగుదేశం పార్టీ గట్టిగా పోరాడటంతో, పూడ్చి పెట్టిన శ-వా-న్ని తీసి పో-స్ట్ మా-ర్టం చేసారు. ఇదంతా జరుగుతూ ఉండగా, ఇప్పుడు చంద్రబాబుకి చిత్తూరు జిల్లా మదనపల్లి పోలీసులు నోటీసులు జారీ చేసారు. మదనపల్లి సబ్ డివిజనల్ పోలీస్ అధికారి, చంద్రబాబుకు సీఆర్పీసీ 91 నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు డీజీపీకి రాసిన లేఖ ప్రస్తావిస్తూ, సాక్ష్యాలు అన్నీ తమకు ఇవ్వాలని కోరారు. నోటీసులు అందిన వారం లోపు తమ కార్యాలయానికి హాజరు అయ్యి, ఈ కేసు విషయం పై మీ దగ్గర ఉన్న సమాచారం, సాక్ష్యాలు ఇవ్వాలని నోటీసుల్లో తెలిపారు. అయితే ఈ నోటీసులు పై టిడిపి ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంది.