తెలంగాణా కాంగ్రెస్ సీనియర్ నేత, వైఎస్ఆర్ సన్నిహితుడుగా పేరున్న మధు యాష్కీ గౌడ్, జగన్ మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసారు. అసలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తికి, ఏపి పై పని ఏంటి అనుకున్నారా ? లేక ఈ మధ్య కాలంలో వస్తున్న జల వివాదం పై అనుకుంటున్నారా ? కాదు. నిన్న ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లో మధు యాష్కీ మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఇలా పలు అంశాల పై చర్చించారు. ఈ కోవలోనే విలేఖరి ప్రశ్నలు అడుగుతూ, ఇప్పుడు అందరు రాజశేఖర్ రెడ్డి మావాడు మావాడు అంటూ ఓన్ చేసుకుంటున్నారు, కాంగ్రెస్ మా వాడు అంటుంది, అటు జగన్, ఇటు `షర్మిల మాకే సొంతం అంటున్నారు, దీని పై మీ ఉద్దేశం ఏమిటి అని అడగగా, దానికి మధు యాష్కీ స్పందించారు. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ మనిషి అని, ఆయన ముఖ్యమంత్రి అవ్వటానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని, చివరి వరకు కాంగ్రెస్ పార్టీ మంచి కోసమే ఆయన పని చేసాడని అన్నారు. ఆయన అనేక సార్లు తాను ముఖ్యమంత్రి అవ్వటానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని చెప్పారని, రాహుల్ గాంధీని 42 ఎంపీ సీట్లతో ప్రధానిని చేయాలని కలగనే వారని, ఆలాంటి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు, వీళ్ళు అండగా నిలవకుండా, అబాండాలు వేస్తూ అల్లరి చేస్తున్నారని, షర్మిల, జగన్ ను ఉద్దేశించి అన్నారు.

madhu 12072021 2

జగన్ మోహన్ రెడ్డికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 43 వేల కోట్లని సిబిఐ పట్టుకున్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. షర్మిల ఇంత పెద్ద ఎత్తున పార్టీ పెట్టటానికి, డబ్బులు ఎక్కడివి అని, తండ్రి అడ్డం పెట్టుకుని, ఇద్దరూ సంపాదించారుగా అని అన్నారు. వైఎస్ఆర్ చనిపోయిన సమయంలో, విజయమ్మ, జగన్, షర్మిల సోనియా గాంధీ దగ్గరకు వస్తే, జగన్ ను కేంద్ర మంత్రిని చేస్తాను, విజయమ్మకు డిప్యూటీ సియం ఇస్తాం అంటే, కాదు ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రిని చేయాల్సిందే అని పట్టు పట్టి గోల గోల చేసారని అన్నారు. సిబిఐ కేసులు వెనుక మేమున్నాం అంటున్నారని, మరి ఇన్ని ఆస్తులు సిబిఐ పట్టుకుంది కదా, కోర్టు కూడా మీ మాటలు నమ్మలేదు కదా అని ప్రశ్నించారు. ఇదంతా గతం అని, ఇప్పుడు కూడా జగన్ మోహన్ రెడ్డి పై ఒక విషయం చెప్తాను, అక్కడ మా కాంగ్రెస్ పార్టీ , టిడిపి ఇది పట్టుకుంటే, మీకు మంచి లీడ్ వస్తుంది అంటూ, పోలవరం రివర్స్ టెండరింగ్ లో, సాక్షి టీవీ, పేపర్ ఎకౌంటులో, 500 కోట్లు వచ్చాయిని, కావలంటే చూసుకోండి, అంటూ చాలెంజ్ చేసారు. ఇప్పటికే రివర్స్ టెండరింగ్ పై టిడిపి ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. మరి దీని పై వైసీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read