ఒక పక్క ప్రత్యెక హోదా పై నిలదీశారు... దొలేరో నగరం గుట్టు విప్పి, అమరావతి ఏమి పాపం చేసిందని ప్రశ్నించారు... రాష్ట్ర బీజేపీ నేతలు, కేంద్ర బీజేపీ నేతలు చెప్తున్న కాకమ్మ కధల గుట్టు విప్పారు.. జీవీఎల్ లాంటి నేతలను, మహా మూర్తి లైవ్ లో కడిగిపారేస్తే, ఏమి చెయ్యాలో తెలియక నీది తెలుగుదేశం ఛానల్ అంటూ ఎదురు దాడి చేసారు. మా ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయం పై, మేము ప్రశ్నిస్తుంటే, మీకు మేము పచ్చ చానల్స్ అయ్యామా అంటూ మహా మూర్తి అడిగే ప్రశ్నలకు ఒక్క బీజేపీ నాయకుడు దగ్గర సమాధానం లేదు.. ఇక మహా మూర్తిని అడ్డుకోవటం తమ వళ్ల కాదని, ప్రతి రోజు ఆయన చేసే ర్యాగింగ్ తట్టుకోలేమని, మహా మూర్తి వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేమని బీజేపీ అంచనాకు వచ్చి, ఒక నిర్ణయం తీసుకుంది. అదే మహామేత వైఎస్ ఒకప్పుడు తీసుకున్న నిర్ణయం...
ఆ రెండు పత్రికలు అని ఎలా వైఎస్, రెండు పేపర్లను చూడద్దు అన్నాడో, అలాగే ప్రజల గొంతుకుగా ఉన్న మీడియాపై బీజేపీ పార్టీ జులుం చూపించింది
. బీజేపీ ఇచ్చిన హామీలు నేరవేర్చని కారణంగా దాన్ని ప్రశ్నించినందుకు మహా న్యూస్ ని బాయ్ కాట్ చేసింది. ఐదు కోట్ల మంది ప్రజలు పక్షాన పోరాటం చేసినందుకు మీడియాకి దొరికిన ఒక అరుదైన గౌరవం ఇది. ఇక మీదట బీజేపీ నాయకులు, కార్యకర్తలు మహా న్యూస్ చర్చ కార్యక్రమాలకు మరియు ఇతర కార్యక్రమాలకు హాజరు కాకూడదని తీర్మానం చేసుకున్నారు విజయవాడ వేదికగా జరిగిన బీజేపీ రాష్ట్ర స్ధాయి సమావేశంలో మహా న్యూస్ పై ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు...ఏపీ హక్కుల కోసం ప్రజల తరపున పోరాటం చేస్తున్న మహా న్యూస్ ఛానెల్ ని బీజేపీ పార్టీ బాయ్ కాట్ చేయాలని తీర్మానించారు...వాళ్ళు ఇచ్చిన హామీలను నేరవేర్చలేక, ఐదు కోట్ల మంది ప్రజలను మోసం చేస్తూ ముందుకెళ్తున్న బీజేపీ ని ప్రశ్నించినందుకు మహా న్యూస్ కి బీజేపీ పార్టీ ఇచ్చిన గౌరవం ఇది..
ప్రజల పక్షాన నిలబడి, ప్రతి జిల్లాలో ఢిల్లీతో డి ఆంధ్ర రెడీ కార్యక్రమంలో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ప్రజల గొంతుకై పోరాటం చేయినందుకు బీజేపీ పార్టీ మహా న్యూస్ కి గొప్ప సన్మానం చేసింది...బీజేపీ పార్టీ చేస్తున్న తప్పులను, ఆంధ్రప్రదేశ్ కి జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల తరపున ప్రసారం చేసినందుకు ఈవిధంగా ముర్కంగా ప్రవర్తించడం ప్రజాస్వామ్యన్ని అపహాస్యం చేసినట్టే...మహా న్యూస్ డిబేట్స్ కి బీజేపీ నాయకులు వస్తే ఏపీ కి బీజేపీ పార్టీ ఇచ్చిన హామీలను ఎందుకు నేరవేర్చలేక పోయారని ప్రశ్నిస్తున్నారని , వాటికి వారి దెగ్గర సమాధానం లేకపోయేసరికి ఈవిధంగా మొహం చాటేస్తున్నారు... అయితే మహా న్యూస్ మాత్రం, వీరికి గట్టిగా సమాధానం ఇచ్చింది... బీజేపీ పార్టీ బెదిరింపులకు మేము బెధరం, అధరం, మేము ఇప్పుడు, ఎప్పుడు , ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటాము అని చెప్పింది.