ఈ టీవీ ఆంధ్రప్రదేశ్ ఛానల్ మినహా, మన రాష్ట్ర విషయాలు మాత్రమే చెప్పే ఛానల్ ఇంకోటి లేదు... మిగతా చానల్స్ అన్నీ రెండు రాష్ట్రాల వార్తలు ప్రసారం చేస్తూ వస్తున్నాయి... హైదరాబాద్ నుంచి నడుస్తున్న ఈ చానల్స్ అన్నీ ఎక్కువగా తెలంగాణా రాష్ట్ర ప్రయోజనాలే కాపాడుతున్నాయి... ప్రతి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ మీద వివక్ష చూపిస్తున్నాయి... మన అమరావతి నుంచి టీవీ ప్రసారాలు ఉంటే బాగుండు అని ఇక్కడ ప్రజలు అనుకుంటున్నారు... ఈ టీవీ ఆంధ్రప్రదేశ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ వార్తలే చూపిస్తున్నా, ఆపరేషన్స్ అన్నీ హైదరాబాద్ నుంచే జరుగుతున్నాయి...

ఈ క్రమంలో ఐ వెంకటరావు లాంటి దిగ్గజ జర్నలిస్ట్ సారధ్యంలో మొదలైన మహా టీవీ, ఇప్పుడు మన రాష్ట్ర వార్తలు మాత్రమే ఎక్కువగా చూపించనుంది. మరో 3-4 నెలల్లో ఆపరేషన్స్ మొత్తం అమరావతి నుంచే జరగనున్నాయి. మహా టీవీ యాజమాన్యం కూడా మారింది. ఇప్పుడు మహా టీవీని, సీనియర్ పాత్రియకేయుడు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ ఫోరం జనరల్ సెక్రటరీగా ఉన్న, మరెల్ల వంశీ కృష్ణ లీడ్ చేస్తున్నారు....

నిన్న విజయ దశమిని పురస్కరించుకుని, మహా టీవీ కొత్త లోగోను ముఖ్యమంత్రి చంద్రబాబు చేత ప్రారంభించారు.. మహా టీవీ లుక్ కూడా ఇప్పుడు మారిపోయింది... స్పష్టమైన సౌండ్, పిక్చర్ క్వాలిటితో మరింత ఆకర్షణీయంగా మారింది. నవ్యాంధ్ర నిర్మాణానికి మహా న్యూస్ దృఢసంకల్పంతో ఉంది అని, మహా న్యూస్ తరుపున అన్ని సహకారాలు అందిస్తామని టీవీలో స్క్రోలింగ్ వస్తుంది.

ఏది ఏమైనా, త్వరగా అన్ని చానల్స్ అమరావతిలో కూడా ఆపరేషన్స్ స్టార్ట్ చెయ్యాలని, అందరూ ఇక్కడే స్టూడియోలో నిర్మించుకుని, మన రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ, నవ్యాంధ్ర నిర్మాణంలో భాగస్వామ్యం కావలి అని కోరుకుందాం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read