వారం రోజుల క్రితం రిలీజ్ అయిన మహేష్ బాబు 'మహర్షి' సినిమాలోని చివరి సీన్ లో, జగపతిబాబు అంటాడు, కనీసం "ఆ ఒక్క ఊరిని వదిలేసి ఉండాల్సింది, ఈ ఇబ్బంది వచ్చేది కాదు అని"... రేపు మే 23 వ తారీఖున కూడా మోడీ & ...
చివరి డైలాగ్ అదే, కనీసం "ఆ ఒక్క రాష్ట్రాన్ని (ఆంధ్రప్రదేశ్) వదిలేసి ఉండాల్సింది అని" చెప్పుకుంటారు అంటూ, ఇప్పుడు ఇంటర్నెట్ లో ఇదే వ్యవహారం నడుస్తుంది. ఎందుకంటే, జవనరి 2018 వరకు మోడీ అనే వ్యక్తికి ఎదురు లేదు. అటు కాంగ్రెస్ పార్టీ కూడా మోడీని ఎదుర్కునే పరిస్థితిలో లేదు. మోడీకి ఎదురు లేదు అనుకున్న టైంలో, ఏపికి మోడీ అన్యాయం చేసారంటూ చంద్రబాబు పోరాటం మొదలు పెట్టారు. ఇది దేశ వ్యాప్త పోరాటం అయ్యింది. ప్రతిపక్షాలు అన్నీ ఏకం అయ్యాయి.

game 27032019

ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న వేళ, జాతీయ స్థాయిలో ప్రతిపక్షాల ఐక్యతకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కేంద్ర బిందువుగా మారారు. భిన్న ప్రవాహాలుగా ఉన్న ఆయా పార్టీల నేతలందరితో మాట్లాడగలిగే సాన్నిహిత్యం ఉండడం.. దానికి అవసరమైన చొరవ తీసుకోవడంతో ఆయన పాత్ర కీలకంగా మారుతోందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. సుదీర్ఘ కాలంగా జాతీయ స్థాయిలో వివిధ పార్టీల నేతలతో కలిసిమెలిసి పనిచేసిన అనుభవం, రాజకీయంగా సీనియర్‌ కావడం ఆయనకు కలిసి వస్తోంది. ఎన్డీఏతో తెగతెంపుల తర్వాతి నుంచి చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలతో సంబంధాలు మొదలు పెట్టారు. లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ప్రతిపక్షాల్లో ఎక్కువ మంది మద్దతును కూడగట్టిన నాటి నుంచి ఆయన పాత్ర పెరగడం మొదలైంది. తర్వాత ఢిల్లీలో రెండు సార్లు ప్రతిపక్షాల నేతల సమావేశాల నిర్వహణలో కూడా ఆయన చొరవ తీసుకున్నారు.

game 27032019

ఈ పార్టీలన్నీ ఒక కూటమిగా కలిసి బరిలోకి దిగాలని మొదట అనుకున్నా రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ వేర్వేరుగా ఉన్న సమీకరణలను పరిగణనలోకి తీసుకున్నాక ఆ యోచన విరమించుకున్నారు. రాష్ట్రాల్లో ఎవరు ఎలా పోటీ చేసినా జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా నిలవాలని చంద్రబాబు ప్రతిపాదించారు. దీనికి ప్రతిపక్షాలన్నీ అంగీకారం తెలిపాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న దశలో కూడా కొన్ని రాష్ట్రాల్లో ప్రతిపక్షాల మధ్య ఎన్నికల పొత్తులు కుదరడానికి చంద్రబాబు ప్రయత్నం చేశారు. బయటకు పెద్దగా ప్రచారం ఇవ్వకుండా ఆయా పార్టీల నేతలతో ఫోన్లలో మాట్లాడడం లేదంటే మధ్యవర్తులను పంపడం చేశారు. ఈ యత్నాలు కొన్నిచోట్ల సఫలమయ్యాయి. కొన్నిచోట్ల సఫలం కాలేదు. ఏపీలో ఎన్నికల సమయంలో విపక్షాల ఐక్యతను చాటడానికి చంద్రబాబు ఇతర పార్టీల నేతలను రాష్ట్రానికి ప్రచారానికి ఆహ్వానించారు. దేవెగౌడ, మమతా బెనర్జీ, అరవింద్‌ కేజ్రీవాల్‌ తదితరులు వచ్చారు. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, బెంగాల్‌ వెళ్లి ఆయన బీజేపీ వ్యతిరేక పార్టీల తరఫున ప్రచారం చేశారు. వీవీప్యాట్ల స్లిప్పుల లెక్కింపు అంశాన్ని ఎంచుకుని ఆ పేరుతో అన్ని ప్రతిపక్షాలను ఏకం చేయడానికీ కృషి చేశారు. ఈ అంశంపై 21 పార్టీలు కలిసి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయడం వంటి ద్వారా ఐక్యతా సందేశాన్ని ఇచ్చారు. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ బలం తగ్గనుందన్న సూచనలు అందుతుండడంతో బీజేపీయేతర విపక్షాలను ఏకం చేయడానికి ఆయన ముందు నుంచే పావులు కదుపుతున్నారు. రేపు కౌంటింగ్ రోజు చంద్రబాబు కనుక సక్సెస్ అయితే, నిజంగా మోడీ, అమిత్ షా ల నోటి నుంచి వచ్చే డైలాగ్, "ఆ ఒక్క రాష్ట్రాన్ని (ఆంధ్రప్రదేశ్) వదిలేసి ఉండాల్సింది అని"...

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read