కియా కార్ల కంపెనీ... దేశంలోనే అతి పెద్ద ఫారెన్ ఇన్వెస్ట్మెంట్, మన రాష్ట్రానికి వచ్చింది... ఎన్నో రాష్ట్రాలు ఈ కంపెనీ కోసం పోరాడాయి... ఇలాగే ఇంకా ఎన్నో ప్రముఖ కంపెనీలు మన రాష్ట్రానికి వచ్చాయి... ఇవన్నీ దాదాపు చంద్రబాబు నాయడు అనే మ్యాగ్నట్ ను చూసి వచ్చినవే... ఎన్నో రాయతీలు ఇస్తూ, ధనిక రాష్ట్రాలతో పోటీ పడుతూ, ఇవన్నీ చంద్రబాబు సాధిస్తున్నారు... రాష్ట్రానికి రాజధాని లేదు, సరైన ఇన్ఫ్రా లేదు, కాని ఇలాంటి పెద్ద కంపనీలను చంద్రబాబు ఆకర్షిస్తున్నారు... ఇప్పటికే తమిళనాడు, కర్నాటక లాంటి రాష్ట్రాల ప్రజలు సోషల్ మీడియాలో, మాకు ఇలాంటి ముఖ్యమంత్రి లేడే అనే కామెంట్స్ పెడతం చూస్తున్నాం....
ఇప్పుడు ఏకంగా దేశంలోనే ధనిక రాష్ట్రం అయిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా, చంద్రబాబుని, మీకు, మీ రాష్ట్రానికి నమస్కారం సార్, మాకు రావల్సిన ప్రాజెక్ట్ లు అన్నీ లాగేస్తున్నారుగా అంటూ సరదాగా వ్యాఖ్యానించారు... ఇటీవల దావోసలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో వీరిద్దరూ ఎదురు పడ్డారు.... ఈ సందర్భంగా ఫడ్నవీస్, చంద్రబాబుతో సమావేశం అయ్యారు... ఇద్దరి మధ్య సరదా సంభాషణ జరిగింది...
"మీతో పోటీ పడలేకపోతున్నాం. గతంలో మహారాష్ట్ర, గుజరాత్ పేరు చెబితే చాలు పారిశ్రామికవేత్తలు ఎలాంటి రాయితీలూ ఆశించకుండానే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొ చ్చేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్న రాయితీలను ప్రస్తావిస్తూ.. వాటికి దీటుగా ప్రోత్సాహకాలిస్తేనే మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా మంటూ బేరాలాడుతున్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలు మాత్రమే కాకుండా.. బడా, మెగా పరిశ్రమలు కూడా ఇదే తరహాలో బేరమాడుతు న్నాయి. మీరింత జోరు ప్రదర్శిస్తే ఇక ఏపీతో పోటీపడలేం' అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ చంద్రబాబుతో అన్నారు...