‘భరత్ అనే నేను’ సినిమా సక్సెస్ కావటంతో, సినిమా ప్రమోషన్ లో భాగంగా, మహేష్ బాబు ఈ రోజు విజయవాడలో పర్యటించారు.. ప్రేక్ష‌కుల‌తో క‌ల‌సి సినిమాను చూసేందుకు ప్ర‌త్యేక విమానంలో, హైదరాబాద్ నుంచి విజ‌య‌వాడ చేరుకున్నారు. దర్శకుడు కొరటాల శివ, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తో కలిసి ఆయన విజయవాడ వచ్చారు. గ‌న్న‌వ‌రం విమానాశ్ర‌యం నుంచి నేరుగా, క‌న‌క‌దుర్గ‌మ్మ అమ్మ‌వారి ఆల‌యానికి చేరుకొని, అమ్మవారిని ద‌ర్శించుకున్నారు.. ఆల‌యానికి చేరుకున్న మ‌హేష్, దర్శకుడు, ఇతరులకు, ఆల‌య మ‌ర్యాద‌ల‌తో స్వాగతం ప‌లికారు. అనంత‌రం ద‌ర్శ‌న ఏర్పాట్లు చేసి అమ్మవారి తీర్ధ‌ప్ర‌సాదాల‌ను అంద‌జేశారు.

అక్కడ నుంచి, బెంజిసర్కిల్ ట్రెండ్ సెట్‌ మాల్ లో ప్రేక్షకులతో కలిసి ‘భరత్ అనే నేను’ సినిమాను చుసారు. తరువాత, డీవీ మానర్‌ హోటల్‌లో మహేశ్‌బాబు గుండె శస్త్ర చికిత్స చేసుకున్న చిన్నారులను కలిశారు. ఆంధ్రా హాస్పిటల్స్ మరియి ఇంగ్లండ్‌కు చెందిన లిటిల్ హెవెన్స్ ఆధ్వర్యంలో, ఇప్పటి వరకు 300 మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేశారు. గుండె చికిత్స చేయించుకున్న చిన్నారులతో కలిసి మహేష్ కాసేపు సరదాగా గడిపారు. రెండేళ్లుగా చిన్న పిల్లల హార్ట్ ఆపరేషన్లకు మహేష్‌బాబు సహకారం అందిస్తున్నారని, అలాగే బుర్రిపాలెం గ్రామంలో మెడికల్ క్యాంపులు నిర్వహించామని, వైద్యులు తెలిపారు. ఆంధ్రా హాస్పిటల్ చీఫ్‌ పిడియాట్రిషియన్ రామారావు మాట్లాడుతూ, చిన్న పిల్లల ఆపరేషన్ల పై, షార్ట్‌ఫిల్మ్‌ తీసేందుకు మహేష్‌ అంగీకరించారని తెలిపారు.

అనంతరం, మహేష్ మీడియాతో మాట్లాడారు.. విజయవాడ రావడం చాలా సంతోషంగా ఉందని, ఇక్కడికి రావడం సెంటిమెంట్‌గా ఫీలవుతానన్నారు. ఒక్కడు, పోకిరి, దూకుడు వంటి విజయోత్సవ సభలు విజయవాడలోనే నిర్వహించిన సంగతిని గుర్తుచేసుకున్నారు. రాజకీయ అరంగేట్రం గురించి ప్రస్తావించగా, తనకు వందేళ్లు వచ్చే వరకూ సినిమాల్లోనే నటిస్తానని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి రానని వెల్లడించారు. జీవితాంతం సినిమాలు చేస్తానని, ఇతర విషయాల జోలికి వెళ్లనని మహేష్‌బాబు ఘంటాపథంగా చెప్పారు. మహేశ్ బాబును చూడటానికి అభిమానులు భారీగా చేరుకున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read