వైకాపా అధ్యక్షుడు జగన్‌, మాగుంట కలిసి ఉన్న ఫొటోకు విజయ్‌మాల్యా ట్విటర్‌లో లైక్‌ కొట్టడంతోనే వారి మధ్య ఉన్న సంబంధాలు బహిర్గతం అయ్యాయని తెదేపా అధికార ప్రతినిధి లంకా దినకరన్‌ స్పష్టం చేశారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. మోదీ, కేసీఆర్‌, జగన్‌ సంబంధాలకు ఈ ట్వీట్‌ నిదర్శనమన్నారు. సీఎం చంద్రబాబు ముందుచూపు వల్లే రాష్ట్రంలో నిరంతరం నాణ్యమైన విద్యుత్తు సరఫరా జరుగుతోందన్నారు. వైకాపా అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారమేనని చెప్పారు.

radha 19032019

ఇది ఇలా ఉంటే, ఎన్నికలా ప్రచారంలో, జగన పై విమర్శలు ఎక్కుపెట్టారు చంద్రబాబు. ‘‘అవినీతి లేని పాలన అందిస్తానని జగన్‌ అంటున్నారు. ఆయన అవినీతి ప్రపంచానికంతా తెలుసు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలో జగన్‌ అవినీతిపై కేస్‌స్టడీ ఉంది. నాపై నమ్మకం ఉంచిన రాజధాని రైతులు భూములు ఇచ్చారు. అదే జగన్‌ వస్తే ఆ భూములను కొట్టేసి మళ్లీ జైలుకు వెళ్తారు’ అని సీఎం చంద్రబాబునాయుడు విమర్శించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో సోమవారం జరిగిన తెదేపాఎన్నికల సన్నాహక సభలో చంద్రబాబు ప్రసంగించారు. అయిదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసి ఓట్లేయాలని ప్రజలను కోరారు. అనేక సంక్షేమ పథకాల ద్వారా కార్యకర్తలకు ఆయుధాలను ఇచ్చానని, వాటితో జనంలోకి వెళ్లి ఓట్లు వేయించాలని సూచించారు. ఐటీ కేసులకు భయపడి పార్టీని వదిలారని మాజీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఒంగోలు గిత్తల్లా మారి ఆ నమ్మక ద్రోహులను కుమ్మాలని అన్నారు.

radha 19032019

‘‘దేశంలో ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటారు, కానీ ఆ ఫ్రంట్‌లో ఉన్నది ఇద్దరే. 16 సీట్లు గెలిస్తే దేశంలో చక్రం తిప్పుతారట. వాటితో బేరం కుదుర్చుకుని తెలుగుజాతిని అమ్మేస్తారు’ అంటూ కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. జగన్‌, కేసీఆర్‌ కలిశాక చేసిన మొదటి పని పోలవరంపై కేసులు వేయడం. ఫిబ్రవరి 23న పోలవరంపై రిట్‌ పిటిషన్‌ వేశారు. దీనిపై మీ సమాధానం ఏంటో? జగన్‌, కేసీఆర్‌లు చెప్పాలి. ‘‘నేను కేసీఆర్‌ను మూడు వేల సార్లు తిట్టానట. నాకు తిట్లు రావు. గట్టిగా, పౌరుషంగా చెప్తానంతే.. నువ్వు రుబాబు చూపిస్తే నేను భయపడాలా? నేను ఎంత కసిగా ఉండాలి? తెలంగాణ కంటే ఏపీలో మంచి అభివృద్ధి జరిగింది.. అది చూసి ఓర్వలేకనే ఇలా కేసులు వేస్తున్నారు. అమెరికా, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌లో కూడా తెలుగువారు ఉన్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. తెలంగాణలో వ్యాపారం చేస్తే వారికి బెదిరింపులు, కేసులు.. నీ తాటాకు చప్పుళ్లకు మేం భయపడం. అమరావతి శంకుస్థాపనకు వచ్చి కేసీఆర్‌ రూ. 500 కోట్లు ఇస్తానన్నారు, కానీ, మోదీ ఏమనుకుంటాడనో ఇవ్వలేదు. ఇప్పుడు మనకు రావాల్సిన ఆస్తులూ ఇవ్వడం లేదు’’ అని చంద్రబాబు చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read