మోడీ నిరంకుశ పాలనకు విపక్షాలు అన్నీ ఏకం అవుతున్నాయి. పెట్రోల్ రేటు పెరుగుదల, రూపాయి పతనం పై, ఇప్పటికే కేంద్రం ఏమి చెయ్యలేక చేతులు ఎత్తేసింది. రాఫెల్ స్కాం పై నోరు మెదపటం లేదు. ఈ తరుణంలో, ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనవరిలో కోల్‌కతాలో తాము నిర్వహించబోయే భారీ ప్రదర్శనకు హాజరుకావాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. 2019 పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల సంఘటిత శక్తిని ఈ ర్యాలీ ద్వారా నిరూపించాల్సిన అవసరం ఉందని ఆమె లేఖలో పేర్కొన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో వచ్చే ఏడాది జనవరి 19న ఈ భారీ ప్రదర్శన చేపట్టనున్నట్లు వివరించారు.

mamata 08102018

‘‘ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన, ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. లౌకికవాదాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒకేతాటిపైకి వచ్చి పోరాడేందుకు ఇది మంచి వేదికవుతుంది. దేశ చరిత్రలో ఎన్నో కీలక సమావేశాలకు సాక్ష్యంగా నిలిచిన కోల్‌కతాలోని బ్రిగేడ్‌ పరేడ్‌ వద్ద ఈ ప్రదర్శనను ప్రారంభిస్తాం. ఇక్కడి నుంచే అత్యంత కీలకమైన అంశాలపై మనం స్వరం వినిపిద్దాం. ఈ ప్రదర్శనలో మీరు పాల్గొనడం దేశ ఐక్యతను, సమైక్యతను బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని భావిస్తున్నాను’’అని లేఖలో వివరించారు.

mamata 08102018

రెండు రోజుల క్రితమే, చంద్రబాబు తెలుగుదేశం నేతలకు కూడా ఇదే పిలుపు ఇచ్చారు. ఏపీకి బీజేపీ చేసిన అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే., జాతీయస్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టాల్సిందేనని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. భావసారూప్య పార్టీలతో కలిసి పనిచేద్దామని ఆయన ఎంపీలకు దిశానిర్థేశం చేశారు. కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఐటీ దాడులు చేస్తోందనే విషయాన్ని సీబీడీటీకి ఫిర్యాదు చేయటంతో పాటు అక్కడ నిరసనలు తెలపాలని ఎంపీల భేటీలో నిర్ణయించారు. అమరావతి ప్రజా వేదికలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ ఎంపీలతో పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. రానున్న రోజుల్లో బీజేపీ యేతర పక్షాలను ఏకం చేసేందుకు అనుసరించాల్సిన వ్యూహం పై ఇందులో ప్రధానంగా చర్చించారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల, రాజకీయ పరిణామాలు, పొత్తులపైనా కీలక చర్చ జరిగింది. 36 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ భావసారూప్య పార్టీలతో కలిసి పనిచేస్తున్న రాజకీయ విధానాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read