ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అద్యక్షుడు అమిత్ షాల పై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ తీవ్రంగా మండిపడ్డారు. దేశంలో ప్రస్తుతం అత్యవసర పరిస్థితి కన్నా దయనీయంగా పరిస్థితులు ఉన్నాయని ఆరోపించారు. సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)లకు ఆదేశాలిచ్చి తనను వేధిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌కు శారద చిట్ ఫండ్ కుంభకోణంలో సంబంధించి ఆయనను ప్రశ్నించేందుకు వచ్చిన సీబీఐ అధికారులను పశ్చిమ బెంగాల్ పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో మమత మీడియాతో మాట్లాడారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సీబీఐకి ఆదేశాలిచ్చి, పశ్చిమ బెంగాల్‌కు పంపించారన్నారు.

mamata 04022019

పోలీసులపై చర్యలకు తెగబడటం దారుణమన్నారు. తన ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఇది రాజ్యాంగం పై దాడి అని పేర్కొన్నారు. తాను రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు తక్షణమే ధర్నా చేస్తానని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్‌ను ధర్నా ప్రదేశం నుంచే ప్రవేశపెడతానని చెప్పారు. రాజీవ్ కుమార్ నివాసం నుంచి మమత బెనర్జీ మీడియాతో మాట్లాడారు, ఆయనను గట్టిగా సమర్థించారు. తనకు బాబా సాహెబ్ అంబేద్కర్‌ పై విశ్వాసం ఉందన్నారు. శారదా చిట్ ఫండ్ కుంభకోణం కేసు దర్యాప్తు సమయంలో కీలక ఆధారాలను కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్‌ మాయం చేశారని సీబీఐ ఆరోపిస్తోంది.

 

mamata 04022019

చిట్‌ఫండ్‌ స్కామ్‌ల కేసుల్లో విచారించడానికి ఏకంగా 40 మందికిపైగా సీబీఐ అధికారులు ఆదివారం కోల్‌కతాలోని రాజీవ్‌ కుమార్‌ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ హైడ్రామా కొనసాగింది. సీబీఐ అధికారులను సీపీ ఇంటి వద్ద ఉన్న సెంట్రీలు అడ్డుకున్నారు. వారిని లోపలికి వెళ్లనివ్వలేదు. అంతలోనే, వివిధ పోలీసు స్టేషన్ల నుంచి సీనియర్‌ పోలీసు అధికారులు పెద్దఎత్తున తరలి వచ్చారు. వారంట్లు ఉన్నాయా అని ప్రశ్నించారు. సీపీని విచారించడానికి మీ వద్ద ఉన్న కాగితాలు ఏమిటని నిలదీశారు. సీబీఐ అధికారులు ఎటువంటి వారంట్లు చూపించలేదని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు, సిటీ పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. ముఖాముఖి తలపడ్డారు. కొంతమంది సీబీఐ అధికారులను బలవంతంగా అదుపులోకి తీసుకుని పార్క్‌ స్ట్రీట్‌, షేక్‌ స్పియర్‌ పోలీసు స్టేషన్లకు తరలించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read