మోడీ నిరంకుశ పాలనకు విపక్షాలు అన్నీ ఏకం అవుతున్నాయి. పెట్రోల్ రేటు పెరుగుదల, రూపాయి పతనం పై, ఇప్పటికే కేంద్రం ఏమి చెయ్యలేక చేతులు ఎత్తేసింది. రాఫెల్ స్కాం పై నోరు మెదపటం లేదు. ఈ తరుణంలో, ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనవరిలో కోల్‌కతాలో తాము నిర్వహించబోయే భారీ ప్రదర్శనకు హాజరుకావాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లేఖ రాశారు. అయితే, వివిధ రాష్ట్రాల బీజేపేతర పార్టీలను ఆహ్వానించిన దీదీ కెసిఆర్ ను మాత్రం పిలవలేదు. కెసిఆర్ ఆడుతున్న నాటకాల పై మమత కోపంగా ఉన్నారని, అందుకే పిలవలేదని తెలుస్తుంది. అయితే ఈ పరిణామంతో, ఇప్పటికే మోడీకి, కెసిఆర్ దగ్గర అనే అభిప్రాయం బలపడుతుందని, ఓటింగ్ పై ప్రభావితం ఉంటుందేమో అని తెరాస ఆందోళన చెందుతుంది.
ఒకసారి ఫెడరల్ ఫ్రంట్ అని కెసిఆర్, కలకత్తా వెళ్లి, తరువాత మోడీ పంచన చేరటంతో, కెసిఆర్ మోడీ మనిషి అనే విషయం మమతకు అర్ధమైంది. అనేక సందర్భాల్లో మోడీకి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో, కెసిఆర్ ఎక్కడా అడ్రస్ లేడు. దీంతో మోడీ, కెసిఆర్ ఒక్కటే అనే అవగాహనకు వచ్చిన దీదీ, కెసిఆర్ ను పిలవలేదు. అయితే చంద్రబాబుని మాత్రం రమ్మని లేఖ రాసారు. అంతే కాదు, మమత పెట్టబోయే ఫ్రంట్ కు చంద్రబాబు కన్వీనర్ అనే వార్తలు కూడా వస్తున్నాయి. మోడీని డీ కొట్టే దమ్ము ఉన్న వాడు, చంద్రబాబు మాత్రమే అని మిగతా పక్షాలు కూడా నమ్ముతున్నాయి.
మమత చంద్రబాబుకి లేఖ రాస్తూ, ‘‘ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయాల్సిన, ప్రజాస్వామ్య, రాజ్యాంగ వ్యవస్థలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. లౌకికవాదాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒకేతాటిపైకి వచ్చి పోరాడేందుకు ఇది మంచి వేదికవుతుంది. దేశ చరిత్రలో ఎన్నో కీలక సమావేశాలకు సాక్ష్యంగా నిలిచిన కోల్‌కతాలోని బ్రిగేడ్ పరేడ్ వద్ద ఈ ప్రదర్శనను ప్రారంభిస్తాం. ఇక్కడి నుంచే అత్యంత కీలకమైన అంశాలపై మనం స్వరం వినిపిద్దాం. ఈ ప్రదర్శనలో మీరు పాల్గొనడం దేశ ఐక్యతను, సమైక్యతను బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని భావిస్తున్నాను’’అని లేఖలో వివరించారు.