ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విమర్శలు గుప్పించారు. గురువారం ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆమె మాట్లాడుతూ... ‘నేను ప్రధాని మోదీకి సవాలు విసురుతున్నాను. బొగ్గు మాఫియాలో మా 42 మంది లోక్‌సభ అభ్యర్థుల్లో ఎవరైనా ఉన్నట్లు మీరు రుజువు చేస్తే మా అభ్యర్థులందరినీ ఉపసంహరించుకుంటాను. రుజువు చేయడంలో మీరు విఫలమైతే ప్రజల ముందు మీ చెవి పట్టుకుని, 100 గుంజిళ్లు తీయాలి. మీరు ఈ సవాలును స్వీకరిస్తారా? మీ భార్య గురించి మీరు పట్టించుకున్నట్లయితే మీరు ఇతరుల సంక్షేమం గురించి కూడా పట్టించుకునే వారు. ఐదేళ్లలో 10 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మీరు చెప్పారు. ఆ ఉద్యోగాలు ఎక్కడ? పార్లమెంట్ నివేదిక ప్రకారం పశ్చిమ బెంగాల్‌లో మేము నిరుద్యోగాన్ని 40 శాతం తగ్గించాము. భారత చరిత్ర గురించి మోదీ నాతో చర్చ జరపాలి’ వ్యాఖ్యానించారు.

mamatha 0905212019

‘నేను ప్రధాని మోదీని చెంపదెబ్బ కొడతానని ఎప్పుడూ అనలేదు. ప్రజాస్వామ్య దెబ్బ రుచి చూపెడతానని మాత్రమే అన్నాను. భాషను సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రజాస్వామ్య దెబ్బ అంటే ప్రజల నిర్ణయం. నేను ప్రధానిని ఎందుకు కొడతాను?’ అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. కాగా, ఇటీవల ఓ ర్యాలీలో మాట్లాడిన మమత.. మోదీకి ప్రజాస్వామ్య దెబ్బ అంటే ఏమిటో చూపిస్తామంటూ వ్యాఖ్యానించారు. గురువారం మోదీ.. పశ్చిమ బెంగాల్‌లో పర్యటించిన నేపథ్యంలో మాట్లాడుతూ.. ‘దీదీ చెంపదెబ్బ కూడా నాకు ఆశీర్వాదమే’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా పలు ఆరోపణలు చేశారు.

mamatha 0905212019

మరో పక్క, దివంగత మాజీ ప్రధాని, తన తండ్రి రాజీవ్‌ గాంధీపై విమర్శలు చేస్తున్న ప్రధాని మోదీ.. రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో ఫ్రాన్స్‌తో జరిగిన ఒప్పందం గురించి కూడా మాట్లాడాలని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నౌకాదళ యుద్ధనౌకను కుటుంబ సభ్యులతో విహార యాత్రకు వెళ్లడానికి వాడుకున్నారంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను తిప్పికొడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం హరియాణాలోని సిర్సాలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలులో జరిగిన అవకతవకలపై, యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు కల్పించేందుకు ఆయన ఈ ఐదేళ్లలో ఏం చేశారో కూడా ప్రజలకు చెప్పాలి ’ అని ఆయన అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read