కరోనా సమయంలో రాజకీయ సమావేశం జరుగుతుంది అంటూ, తమకు ఫిర్యాదు వచ్చింది అని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి, నోటీస్ ఇచ్చారు, మంగళగిరి తాహసీల్దార్. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయానికి, ఎక్కువ మంది తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు వచ్చారని తమకు ఫిర్యాదు వచ్చిందని, ఆ నోటీస్ లో పేర్కొన్నారు. మహానాకు కార్యక్రమం జరుగుతంది కాబట్టి, కరోనా నివారణకు అన్ని చర్యలు తీసుకోవాలని, ఆయన ఆ నోటీస్ లో కోరారు. దీనికి సంబంధించిన నోటీస్ ను, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి రమణకు ఆత్మకూరు వీఆర్వో వెంకటేశ్వర్లు అందచేసారు. అయితే కార్యకర్తలు ఎవరూ రాలేదని, ముఖ్య నాయకులు మాత్రమే వచ్చారని, మహానాడు జూమ్ యాప్ ద్వారా జరుగుతంది అని, ఇక్కడకు వచ్చిన వారికి కూడా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని, తీసుకున్న జాగ్రత్తలు అన్నీ తెలిపారు. అధికారులకు అన్నీ వివరింకాహారు.

మరో పక్క తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మహానాడులో ప్రారంభ ఉపన్యాసం చేసారు. "38ఏళ్లుగా కార్యకర్తలు త్యాగాలు చేశారు. భుజాలు అరిగిపోయేలా టిడిపి జెండాలు మోశారు. కుటుంబ సభ్యులు హత్యకు గురైనా వెనుకంజ వేయలేదు. ప్రాణాలు పోయినా పార్టీని వదిలేదని చెప్పారు. కార్యకర్తల త్యాగాలు నా జీవితంలో మరిచిపోలేను. గడిచిన ఏడాది దురదృష్టకర సంవత్సరం. శారీరకంగా మానసికంగా ఆర్ధికంగా దెబ్బతీశారు. ఉన్మాదులు మాదిరిగా వైసిపి నేతలు వ్యవహరించారు. చేయని తప్పుకు టిడిపి కార్యకర్తలు జైళ్లకు వెళ్లారు. చిరు వ్యాపారంతో ఉపాది పొందేవాళ్లను ఆర్దికంగా నష్టం చేశారు. బెదిరించి లొంగదీసుకునే కుట్రలు చేశారు. ఆర్ధికంగా కుంగదీసినా, శారీరకంగా హింసించినా పార్టీని వీడని కార్యకర్తలకు పాదాభివందనం చేస్తున్నాను. కరోనా కష్టాల్లో టిడిపి కార్యకర్తల సేవాభావం మరువలేం. సేవాభావానికి మారు పేరు టిడిపి. పేదలకు అండగా ఉన్న అందరికీ అభినందనలు. 38ఏళ్ల చరిత్రలో 22ఏళ్లు అధికారంలో ఉన్నాం, 16ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నాం. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేశాం. సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అనే బాటలో నడిచాం."

"ఎన్టీఆర్ హయాంలో ఆత్మగౌరవాన్ని ప్రబోధించారు. మా హయాంలో ఆత్మవిశ్వాసం పెంచాం . వినూత్న పద్దతుల్లో అబివృద్ది చేశాం. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపాం. టిడిపి పథకాలు దేశానికే మార్గదర్శకం అయ్యాయి. రూ 2 కే కిలో బియ్యం పథకం తర్వాత ఆహార భద్రతగా మారింది. రూ50కే హార్స్ పవర్ విద్యుత్ ఉచిత కరెంటుకు నాంది పలికింది. పక్కా ఇళ్లు కట్టించిన పార్టీ టిడిపి. హైదరాబాద్ ను ప్రపంచస్థాయి నగరంగా చేశాం. జంట నగరాలకు తోడుగా సైబరాబాద్ ను నిర్మించాం. అభివృద్దికి అనుకూల వాతావరణ సృష్టించాం. అవుటర్ రింగ్ రోడ్డు, శంషాబాద్ విమానాశ్రయం, ఐటి, బయోటెక్ అభివృద్ది చేశాం. టిడిపి అభివృద్ది ఇప్పుడు తెలంగాణలో మంచి ఫలితాలను ఇస్తోంది: చంద్రబాబు బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం కృషి చేశాం. బీసిలే టిడిపికి వెన్నెముక. 24% రిజర్వేషన్లు ఎన్టీఆర్ తెచ్చారు. నేను 34%కు పెంచాను. బిసి రిజర్వేషన్లను 24%కన్నా తగ్గించేశారు. 140పైగా బిసి కులాలకు చేతివృత్తులే ఆధారం. కరోనా సమయంలో బలహీన వర్గాలకు అనేక ఇబ్బందులు. ఆదరణ పథకాల ద్వారా టిడిపి వారిని ఆదుకుంది. బీసిలకు ప్రత్యేకంగా సబ్ ప్లాన్ పెట్టాం. 5ఏళ్లలో రూ46వేల కోట్లు బిసిలకు ఖర్చు చేశాం. ఎస్సీలకు రూ40వేల కోట్లు, ఎస్టీలకు రూ12వేల కోట్ల బడ్జెట్ పెట్టాం. ముస్లింల బడ్జెట్ 3రెట్లు అధికం చేశాం. ఎంబిసిలకు రూ 100కోట్లు పెట్టాం. బ్రాహ్మణ సంక్షేమానికి రూ 300కోట్లు పెట్టాం. అభివృద్ది ద్వారా సంపద పెంచాం. పెరిగిన సంపద ద్వారా సంక్షేమం చేశాం. ఉద్యోగులను ఆదరించాం. ఉద్యోగులకు 43% ఫిట్ మెంట్ ఇచ్చాం. ఉద్యోగ విరమణ వయోపరిమితి పెంచాం. రాజధానికి భూములిచ్చిన రైతులను రోడ్డుమీదకు తెచ్చారు. కరోనాలోనూ ఆందోళనలు చేసే దుస్థితి కల్పించారు. వాళ్లు పోరాడుతుంటే ఈ సీఎం జగన్ పైశాచిక ఆనందం అనుభవిస్తున్నారు. " అని చంద్రబాబు అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read