తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది అక్టోబర్ 19 న, తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై, వైసీపీ రౌడీ మూకలు దా-డి చేసి, నానా భీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. దొరికిన వారిని దొరికినట్టు, సుత్తులు, కర్రలతో కొట్టి నానా భీభత్సం సృష్టించారు. అయితే ఇంత పెద్ద ఘటన, దేశంలో ఎప్పుడూ జరగని విధంగా ఒక పార్టీ కేంద్ర కార్యాలయం పై దా-డు-లు చేస్తే, అనూహ్యంగా ఈ ఘటన తరువాత, టిడిపి ఆఫీస్ కు ఉండే సాయుధ భద్రతను తొలగించారు. అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి 24 గంటలు సాయుధ బలగాలతో భద్రత ఉండేది. అయితే పార్టీ కార్యాలయానికి కానీ, పార్టీ అధినేత చంద్రబాబుకు కానీ, ఎలాంటి నోటీసులు కానీ, సమాచారం కనీ ఇవ్వకుండా, భద్రతను ఉన్నట్టు ఉండి పోలీసులు తొలగించారు. ఈ ఘటన జరిగిన తరువాత జగన్ మోహన్ రెడ్డి స్పందిస్తూ, మా పార్టీకి చెందిన కొంత మంది, బీపీలు పెరిగి, అక్కడకు వెళ్లి విధ్వంసం చేసారు, తప్పు ఏమి ఉంది అంటూ సమర్ధించుకున్నారు. ఈ ఘటన తరువాత, పోలీసుల సాయుధ భద్రత తొలగించటం పై, తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇప్పుడు కరోనా సద్దుమనిగిన తరువాత, టిడిపి ఆక్టివ్ అయ్యింది.

tdp 09032022 2

ఈ మధ్య కాలంలో అనేక సమావేశాలు కేంద్ర కార్యాలయంలో జరుగుతున్నాయి. చంద్రబాబు సహా, ఇతర ప్రజా ప్రతినిధులు తరుచూ కేంద్ర కార్యాలయానికి వస్తున్నారు. ఈ నేపధ్యంలో, పార్టీ కేంద్ర కార్యాలయంలో భద్రత లేక పోవటం పై తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. పార్టీ ప్రధాన కార్యాలయంకు భద్రత కల్పించాలంటూ డీజీపీ కి టిడిపి లేఖ రాసింది. పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య డీజీపీకి లేఖ రాసి, సాయుధ భద్రత కావాలని కోరారు. గతంలో జరిగిన అనుభవాలు దృష్టిలో ఉంచుకుని, భద్రత ఇవ్వాలని, చంద్రబాబు గారికి జెడ్ ప్లస్ భద్రత ఉందని, ప్రతి రోజు ఆయన రాత్రి వరకు ఆఫీస్ లో ఉంటున్నారని, అలాగే శాసనసభ్యులు ప్రతిరోజూ ఆఫీస్ కు వస్తున్నారని, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వస్తున్నారని, వాళ్ళ ముసుగులో సంఘ విద్రోహ శక్తులు చొరబడి, వారిని నుంచి తమకు ముప్పు ఉందని, గతంలో జరిగిన అనుభవాలు చూసి, భద్రత ఇవ్వాలి అంటూ, డీజీపీకి లేఖ రాసారు. గతంలో ఉండే భద్రత చెప్పా పెట్టకుండా తీశేసారని, దాన్ని మళ్ళీ ఇవ్వాలని కోరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read