ఒక పక్క కేంద్రం ఈ బడ్జెట్ లో మాకు అన్యాయం చేసేంది అంటూ, రాష్ట్రంలోని చిన్న పిల్లాడి దగ్గర నుంచి ముఖ్యమంత్రి దాకా దుమ్మిత్తి పోస్తుంటే, ముఖ్యమంత్రి సహచరుడిగా, అదే మంత్రి వర్గంలో ఉన్న మంత్రి మాత్రం, కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ బ్రహ్మాండం అంటూ కితాబు ఇచ్చారు... ఆ మంత్రి గారే, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు గారు... ఈయనే మొన్న, నా జోలికి వస్తే, ఏపి కట్ చేస్తా అన్నాడు... కట్ చేసే టైం వచ్చిందో ఏమో కాని, రాష్ట్రం అంతా ఆందోళనలో ఉంటే, ఈయాన మాత్రం, రాష్ట్రానికి జరిగిన అన్యాయం కూడా బ్రహ్మాండం అంటూ, తన పార్టీకి భజన చేసుకుంటూ, రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర ప్రజల మనోభావాలని గాలికి వదిలేసారు... ఇంతకీ ఆయన ఏమన్నారో తెలుసా...
బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని మాణిక్యాలరావు కేంద్రంపై ప్రశంసల జల్లు కురిపించారు... దేశంలోని అన్ని రాష్ట్రాలతో సమానంగానే ఏపీని చూస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రాలు వేరు, ఏపీ వేరు అనడం సరికాదని ఆయన చెప్పుకొచ్చారు. బడ్జెట్ బ్రహ్మాండంగా ఉందని ప్రజల్లోకి వెళ్లి చెప్పగలమని మంత్రి అన్నారు. ఏపీకి అన్యాయం జరిగిందనేది మిత్రపక్షంలోని కొందరి వాదన మాత్రమేనన్నారు. ఏపీ నేతలు ఇంకా రికార్డ్స్ ఏమీ చూడలేదు, ఈ రెండు మూడురోజులు బడ్జెట్‌పై స్టడీ చేయాల్సిన అవసరముందని అన్నారు...
అయినా మాణిక్యాలరావు గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, మిగతా రాష్ట్రాలతో సమానమా ? మిగతా రాష్ట్రాలతో సమానంగా చూస్తారా ? ఆ లాజిక్ ప్రకారం చూసినా, బెంగుళూరు పేరు చెప్పి 17 వేల కోట్లు, మహారాష్ట్ర పేరు చెప్పి 40 వేల కోట్లు ఇచ్చారుగా అండి ? దగా పడ్డ రాష్ట్రానికి కనీసం చెప్పిన వాటిల్లో సగం అయినా చెయ్యాలి కదా ? మీకు ఈ బడ్జెట్ లో అంత అద్భుతమైనవి ఏమి కనిపించాయి ? ఈ అద్భుతాన్ని పట్టుకుని ప్రజల్లోకి వెళ్తారా ? వెళ్ళండి సార్... కనీసం ప్రజల మనోభావాలు అర్ధం చేసుకోండి...