వైసిపీ - బీజేపీ బంధం రోజు రొజుకీ బలపడుతుంది.. నిన్న మొన్నటి వరకు చాటుగా ఉన్న వ్యవహారం, నెమ్మదిగా బహిరంగం అయిపోతుంది... ఒక పక్క చంద్రబాబు ఉతుకుడు మొదలు పెట్టటంతో, బీజేపీ కూడా అన్నిటికీ తెగించి, జగన్ తో వెళ్ళటానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటుంది... ఈ నేపధ్యంలో, బీజేపీ నేత మాణిక్యాలరావు కీలక వ్యాఖ్యలు చేశారు... ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ... ఒకరు తమతో పొత్తు వదులుకుంటే, మరొకరు కలవడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.... అంటే దీన్ని బట్టి, జగన్ ఎంతగా క్లోజ్ అయిపోయారో తెలిసిపోతుంది...
టీడీపీ తెగదెంపులు చేసుకోక ముందే మనమే బయటకొద్దామని తమ నేతలతో ఇప్పటికే చెప్పానని మాణిక్యాలరావు అన్నారు. ఇక ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ రాష్ట్రానికి ఏమి చేశామో ప్రజలకు చెబుతామని అన్నారు.... కేంద్రం ఎంతో చేసింది అని, అదంతా ప్రజలకు చెప్తాం అన్నారు... మంత్రి పదవులకి రాజీనామాలు చేయాలని అధిష్ఠానం ఆదేశిస్తే నిమిషంలో చేస్తామని చెప్పుకొచ్చారు.... టీడీపీతో పొత్తు విడిపోతే బీజేపీకి పెద్దగా నష్టం ఉండదని తెలిపారు.
బీజేపీతో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో మూడు పార్టీలు తెగతెంపులు చేసుకున్నాయని, ఏపీలో టీడీపీతో పొత్తు తెంచుకునే ఉద్దేశం తమకు లేదని, తప్పదు అనుకుంటే ఎంతో సేపు పట్టాదు అని మాణిక్యాలరావు చెప్పారు. కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీని త్వరలోనే ఏపీకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు. బీజేపీతో టీడీపీ విడిపోయినా కేంద్ర ప్రభుత్వానికి పెద్దగా నష్టం ఏమీ లేదని ఆయన అన్నారు. బీజేపీతో పంజాబ్‌లో అకాళీదల్, మహారాష్ట్రలో శివసేన, ఒడిశాలో బీజేడీ పార్టీలు తెగదెంపులు చేసుకున్న విషయం తెలుసుకోవాలంటూ, టిడిపి వెళ్ళిపోయినా, మా కొత్త స్నేహితుడు జగన్ రెడీగా ఉన్నాడనే సంకేతం ఇచ్చారు..