రాయలసీమ అంటే మాకు ఎంతో ఇష్టం, మా మోడీకి ఎంతో ఇష్టం, చంద్రబాబు రాయలసీమాకు అన్యాయం చేస్తున్నారు అంటూ, రాయలసీమ డిక్లరేషన్ అంటూ హడావిడి చేసిన బీజేపీ నాయాకుల అసలు రంగు బయట పడింది. రాయలసీమ అంటూ మాకు ఎంతో ప్రేమ ఉందని ఒలకబోస్తున్న ప్రేమ,బూటకమని తేలిపోయింది. ఒక పక్క వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు విడుదల చేసిన రూ.350 కోట్ల నిధులను ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకోవటం, మరో పక్క వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పిచేందుకు అవకాశమున్న కడప ఉక్కు ఫ్యాక్టరీని పక్కన పడేయటం లాంటివి చేస్తున్న కేంద్రం, రాయలసీమకు ఎంతో ప్రతిష్టాత్మిక ప్రాజెక్ట్ అయిన మన్నవరం ప్రాజెక్టును కూడా అటకెక్కించింది.
చిత్తూరు జిల్లా మన్నవరంలోని ఈ ప్రాజెక్టును గుజరాత్‌కు తరలించనున్నారని రెండేళ్ల క్రితమే వార్తలొచ్చాయి. దీని పై పెద్ద ఎత్తున విమర్శలు రావటం, అప్పట్లో చంద్రబాబు ఒత్తిడి తేవటంతో వెనక్కు తగ్గారు. ఇప్పుడు చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు రావటంతో, ఇక వారికి అడ్డు లేకుండా పోయింది. ఈ ప్రాజెక్టు లాభదాయకంగా లేదని.. మూడేళ్లుగా నష్టాల్లో ఉందంటూ దీనిని మూసివేయాలని నిర్ణయించామని కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్‌కే సింగ్ మంగళవారం రాజ్యసభలో ప్రకటించారు. ఈ ప్రకటనతో రాష్ట్ర ప్రజలు.. ముఖ్యంగా సీమవాసులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.
ప్రాజెక్టు నుంచి వైదొలగడానికి ఎన్‌టీపీసీ నుంచీ విజ్ఞాపన అందినట్లు తెలిపారు. మంగళవారం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అడిగిన రాతపూర్వక ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. రెండేళ్ళ క్రితం పియూష్ గోయల్ మాట్లాడుతూ, ‘మన్నవరం ప్రాజెక్టును వేరే రాష్ట్రానికి తరలిస్తున్నామని వస్తున్న ఆరోపణలు నిరాధారమైనవి. ఈ ప్రాజెక్టును తరలించం. దీనిద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటాం.’ అని అన్నారు. కాని నిన్న, ఆర్‌కే సింగ్ మాట్లాడుతూ, ఇది సాధ్యం కాదని చెప్పేశారు. ఈ ప్రాజెక్ట్ ఇక్కడ పెట్టాలని, 2007లో నాటి యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా మన్నవరంలో రూ.6000 కోట్ల పెట్టుబడితో ప్లాంటు ఏర్పాటుకు ఎన్‌బీపీపీఎల్ నిర్ణయించింది.
2010లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించారు. కాని కానీ దీనిపై అప్పటి నుంచి ఇప్పటివరకు పెట్టుబడి పెట్టింది కేవలం రూ.120 కోట్లే. నామమాత్రపు కేటాయింపులతో శీతకన్ను వేసిన కేంద్రం.. దీనిని గుజరాత్‌కు తరలించే యోచనలో ఉందని 2016లోనే వార్తలు వచ్చాయి. దాంతో ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. అదే ఏడాది అక్టోబరు 19న అప్పటి కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు చొరవ తీసుకుని సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ ప్రాజెక్టును తరలించే ప్రసక్తే లేదని గోయల్ స్పష్టం చేయడమే కాకుండా యూనిట్‌కు మరిన్ని ఆర్డ ర్లు తీసుకొచ్చే ప్రణాళిక రూపొందించడానికి బీహెచ్‌ఈఎల్ సీఎండీ నేతృత్వంలో ఐదుగురు సభ్యుల అత్యున్న త కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. నిరుడు ఫిబ్రవరి 6న టీడీపీ ఎంపీ టీజీ వెంకటేశ్‌కు రాజ్యసభ లో ఆయనే జవాబిస్తూ.. ప్రాజెక్టును తరలించడం లేదని లిఖితపూర్వకంగా కూడా చెప్పారు. కాగా, ప్రాజెక్టును మూసివేస్తున్నామని మంగళవారం రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావుకు కేంద్ర మంత్రి ఆర్‌కే సింగ్ లిఖిత పూర్వకంగా తెలియజేశారు.