ప్రకాశం బ్యారేజీ వద్ద ఎన్టీఆర్ సాగర్‌లో రెండో రోజు ఎఫ్1హెచ్2ఓ-పవర్ బోట్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి.. ప్రధానంగా ఫార్ములా-1 అర్హత పోటీలు ఉత్కంఠభరితంగా సాగి ఉర్రూతలూగించాయి. మూడు రౌండ్లుగా జరిగిన ఈ పోటీల్లో అమరావతి బోట్ డ్రైవర్ అగ్రస్థానంలో నిలవాలంటూ.. ప్రేక్షకులు కేరింతలు కొడుతూ ప్రోత్సహించారు. శనివారం ఫార్ములా-1 అర్హత పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ రౌండ్లలో కేవలం కొన్ని సెకన్ల తేడాతో కొందరు, మిల్లీసెకన్ తేడాతో ఒక డ్రైవర్ తాము ఆశించిన స్థానాన్ని అందుకోలేకపోయారు.. అయితే, ఈ రేస్ చూడటానికి, హీరో మంచు మానోజ్ కూడా అమరావతి వచ్చారు. రేస్ చూసిన తరువాత మనోజ్ తన అనుభూతిని, సోషల్ మీడియాలో పంచుకున్నారు.
"Watch #F1H2O today..Thanks to Tourism Minister Akhila Bhuma and TeluguDesamParty for inviting me to such an crazy and great event conducted by our CM Nara Chandrababu Naidu...Great initiative and a proud moment for India and specially Telugu people ???? Was fun watching this with my fav Bhuvaneshwari garu... #F1H2O_Amaravati ' అంటూ పోస్ట్ పెట్టారు మనోజ్. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహిస్తున్న ఎఫ్1హెచ్2ఓ పవర్ బోటింగ్ రేసుల్లో భాగంగా శనివారం జరిగిన రేసులో మనోజ్ పాల్గున్నారు.
మరో పక్క, స్థాయికి మించి రాణించిన అమరావతి టీమ్(ఐదో స్థానం)తో పాటు అబుదబీ టీమ్‌కు చెందిన షాన్ టొరెంటె(ప్రథమ స్థానం), ఎమిరేట్స్ రేసింగ్ టీమ్‌కు చెందిన మేరిట్ స్ర్టోమోయ్(ద్వితీయ స్థానం), అబు దబీ టీమ్‌కు చెందిన ఎరిక్ స్టార్క్(తృతీయ స్థానం), థాని అల్ కెమ్జీ (నాలుగో స్థానం), టీమ్ విక్టరీకి చెందిన అహ్మ ద్ అల్ హమేలీ(ఆరోస్థానం) ఫైనల్స్‌కు చేరుకున్నారు. టీమ్ అమరావతి ఫైనల్స్‌కు చేరుకుందని విన్న గ్యాలరీల్లోని ప్రజలు జై అమరావతి అంటూ హర్షధ్వానాలు చేస్తూ.. డ్రైవర్ ఆండర్సన్‌కు అభినందనలు తెలిపారు. ల్యాప్స్(లక్ష్యాన్ని)ను అతితక్కువ సమయంలో దాటిన రేసర్ల ప్రతిభను బట్టి విజేతలను నిర్ణయించారు. ప్రతిభకు పట్టం కట్టిన నిర్ణేతల న్యాయంతో అమరావతి టీమ్ ఫైనల్స్‌కు స్థానం దక్కించుకుంది.