మొన్న కియా దెబ్బతో, హీరో మంచు మనోజ్ అలెర్ట్ అయ్యారు. కియా మొదటి కారు వచ్చిన రోజు, ఏపి ప్రభుత్వాన్ని పొగుడుతూ ట్వీట్ చేసి, వెంటనే డిలీట్ చేసారు. అయితే దీని పై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. కేసీఆర్ కు భయపడి డిలీట్ చేసారని, మోహన్ బాబుకి చంద్రబాబు అంటే పడదు కాబట్టి డిలీట్ చేసారని, ఇలా అనేక రకాలుగా కామెంట్ లు వచ్చాయి. అయితే, ఈ రోజు మళ్ళీ ట్వీట్ చేసారు మనోజ్. ఈ రోజు కేంద్ర బడ్జెట్ లో, ఏపికి జరిగిన అన్యాయం పై ట్విట్టర్ లో స్పందించారు. మంచు మనోజ్ తన ట్విట్టర్‌లో చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. భారత ప్రధానమంత్రిని టార్గెట్ చేస్తూ.. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ కోసం ఆయన ఈ ట్వీట్ చేశారు.

manoj 01022019 1

ఇది మనోజ్ చేసిన ట్వీట్ ‘‘పీఎం నరేంద్రమోదీ, ఇన్నాళ్లూ మీరు చేస్తున్న ఫైట్‌లో మేమంతా మీతోనే ఉన్నాం. మాకు మీరేదో చేస్తారని, మీరిచ్చిన హామీలను నెరవేరుస్తారని.. ఇంతకాలం మిమ్మల్నే సపోర్ట్ చేస్తూ వేచి చూశాం. అయితే స్పెషల్ స్టేటస్‌ కాదు కదా.. కనీసం కృతజ్ఞతాభావం కూడా మీ నుంచి రాలేదు. ఇప్పటికైనా మా డిమాండ్‌ను గౌరవించి, మా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వండి.. లేదంటే మీరు ఎవరి సన్నిధిలో అయితే ఆ ప్రమాణం చేశారో.. ఆ బాలాజీ ఆగ్రహానికి గురికాకతప్పదు..’’ అంటూ మంచు మనోజ్ ఘాటుగా ట్వీట్ చేశారు. అయితే వెంటనే మరో రిప్లై కూడా ఇచ్చారు. చివరి లైన్ బాగోలేదు అంటూ, ఒక నెటిజెన్ పెట్టిన కామెంట్ కి స్పందించారు.

manoj 01022019 1

ఎవరికి ఆ భాషలో చెప్పాలో, అదే భాషలో చెప్పాలి అంటూ, ఆ నెటిజెన్ కు బదులు ఇచ్చారు మనోజ్. మరో పక్క మంచు మనోజ్ చేసిన ట్వీట్, నారా లోకేష్ రీట్వీట్ చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసులో ఉన్న మాటే మీరూ చెప్పారు అంటూ, లోకేష్ అన్నారు. ఈ రోజు ఉదయం కూడా బంద్ లో పాల్గున్న అనేక మంది, సినీ పరిశ్రమ పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఇక్కడ ప్రజలు నుంచి ఆదరణ పొంది, హైదరాబాద్ లో కూర్చుని, ఇక్కడ ప్రజలు ఇబ్బందుల్లో ఉంటూ, ఆందోళన చేస్తుంటే, హైదరాబాద్ లో ఉన్న సినీ ప్రముఖులకు పట్టదా అంటూ, చాలా మంది విమర్శలు చేసారు. అయితే ఇప్పటికి మంచు మనోజ్ ఒక్కరే సినీ ఇండస్ట్రీ నుంచి స్పందించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read