మంత్రివర్గ ఏర్పాటుపై వైయస్ జగన్ మాహన్ రెడ్డి ఏకంగా ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా చేయనున్న ట్లు ఆయన పేర్కొన్నారు. శుక్రవారం తాడేపల్లిలోని ఆయన నివాసంలో వైయస్సార్ ఎల్పీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగన్‌మోహన్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. దేశ రాజకీయాల్లో ఏపీ రాజకీయాలు ప్రత్యేకంగా నిలవాలని తన ఆకాంక్షగా ఆయన స్పష్టంచేశారు. రాజకీయాలను మునుపెన్నడూ లేని విధంగా ప్రక్షా ళన చేస్తానని మరోమారు పునరుద్ఘాటించారు. అయితే, ఈ క్రమం లో కొందరికి మోదం, కొందరికి ఖేదం కలిగే అవకాశముందని, తనతోపాటు ప్రయాణం చేసేప్పుడు ఇవన్నీ సర్వసాధారణమని భావించాలని కోరారు. అయితే, తనను, పార్టీని నమ్ముకుని ఉన్నవా రికి న్యాయం మాత్రం తప్పకుండా జరుగుతుందని స్పష్టంచేశారు.
కాకపోతే ఒకరికి ముందు..మరొకరికి తరువాత అన్న రీతిలో అది ఉటుందని, దీనికి అందరూ సహకరించాలని సూచించారు. ఎన్నికల సమయంలో కూడా తాను 175 అసెంబ్లి, 25 పార్లమెంటు స్థానాలకు అభ్యర్ధులను ఒకేమారు ప్రకటించానని, ఇప్పుడు కూడా మంత్రి వర్గాన్ని ఒకేసారి విస్తరించనున్నట్లు చెప్పారు. వీరందరికీ మీ అంద రూ ఆమోదం తెలియజేయాలని సభ్యులను కోరారు. మరో పక్క, జగన్ కేబినెట్ కూర్పులో తమకు కచ్చితంగా మంత్రి పదవి దొరుకుతుందని చివరి వరకూ ఆశించిన వారికి చోటు దక్కక పోవడంతో వారూ, వారి అనుచరులు తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. ముఖ్యంగా ఫైర్‌బ్రాండ్‌గా ముద్రపడ్డ ఆర్కే రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డితో పాటు మరో కీలక నేత, జగన్ కుటుంబానికి అత్యంత ఆత్మీయుడైన భూమన కరుణాకర రెడ్డికి సైతం చోటు దక్కకపోవడం గమనార్హం. జగన్ కేబినెట్‌లో మంత్రి పదవిని ఆశించి భంగపడ్డ నేతల లిస్ట్....
చిత్తూరు జిల్లా నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా, చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, గుంటూరు జిల్లా సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు(కాపు), కర్నూలు జిల్లా- శిల్పా కుటుంబం, ,పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు , కడప జిల్లా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, కడప జిల్లా రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, మంగళగిరి ఎమ్మెల్యే-ఆళ్ల రామకృష్ణారెడ్డి, గుంటూరు జిల్లా- మర్రి రాజశేఖర్(చిలకలూరిపేట నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ నేత..అయితే విడదల రజనీకి టికెట్ కేటాయించడంతో మర్రి రాజశేఖర్‌కు మంత్రి పదవి ఇస్తానని రోడ్ షోలో ప్రజల ముందు బహిరంగంగా చెప్పిన జగన్.. కానీ ఇప్పుడు కూడా మర్రికి చుక్కెదురైంది.