తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ గాలి వీస్తోంది. టిడిపిలో చేరేందుకు నేతలు తహతహలాడుతున్నారు. 2019లో టిడిపి ఓటమి పాలైన వెంటనే కొందరు పార్టీతో అంటీముట్టనట్టు వ్యవహరించడం మొదలుపెట్టారు. మరికొందరు వైసీపీ గూటికి, ఇంకొందరు బీజేపీ పంచన చేరారు. దాదాపు నాలుగేళ్లు వైసీపీ పాలన పూర్తి కావస్తోంది. ఏడాదిలో ఎన్నికలు రానున్నాయి. వైసీపీ సర్కారుపై ప్రజావ్యతిరేకత తీవ్రం అవుతోంది. చంద్రబాబు వెంట జనం ప్రభంజనమై కదలి వస్తున్నారు. అన్నిమార్గాల్లో అడ్డుకోవాలని చూస్తున్న సర్కారు అభాసు పాలవుతోంది. ప్రజలు ప్రతిపక్షం వెంట నడుస్తున్నారు. పబ్లిక్ పల్స్ పట్టేసిన కొందరు జంపింగ్ స్పెషలిస్టులు మళ్లీ వచ్చేది తెలుగుదేశమే అని ఫిక్సయిపోయారు. చంద్రబాబుని ప్రసన్నం చేసుకునే పనిలోపడ్డారు. కొందరు చినబాబు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు ఆరంభించారు. గత ఎన్నికల్లో టిడిపిని వీడి వెళ్లిపోయిన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ బీజేపీలో చేరారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ఓకే అంటే టిడిపిలో చేరాలని తహతహలాడుతున్నారు. టిడిపి నుంచి వైసీపీలో చేరిన మాజీ మంత్రి పాలేటి రామారావు టిడిపి నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే డేవిడ్ రాజు టిడిపి చేర్చుకోకపోయినా టిడిపిలో చేరాలని తిరుగుతూనే ఉన్నారు. కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే సోదరుడు తాను టిడిపి గెలుపు కోసం పనిచేస్తానని ప్రకటించారు. మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు చంద్రబాబుతో భేటీ అయ్యారు. అన్ని జిల్లాల నుంచి టిడిపిలో చేరేందుకు నేతలు క్యూ కడుతున్నారు.
తెలుగుదేశం ప్రభుత్వం వస్తోంది..పార్టీలో చేరేందుకు నేతల క్యూ..
Advertisements