ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ఆండ్రగూడ వద్ద నాలుగు రోజుల కిందట పోలీసుల కాల్పుల్లో తెలంగాణ జనగామ జిల్లాకు చెందిన మహిళా మావోయిస్టు మీనా అలియాస్ ప్రమీల మృతిచెందిన విషయం తెలిసిందే. ఆండ్రగూడ ఎన్‌కౌంటర్‌పై స్పందించిన మావోయిస్టులు ఈ మేరకు వారి ప్రతినిధి కైలాసం ఆడియో టేపును విడుదల చేశారు. ఓ ద్రోహి ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు మావోయిస్టులను చుట్టుముట్టి మీనాను అతి సమీపం నుంచి కాల్చి చంపారని ఆరోపించారు. కాల్పుల్లో గాయపడిన మీనాను అదుపులోకి తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ అలా చేయకుండా హతమార్చారని పేర్కొన్నారు.

maoist 15102018 2

మీనా మృతి మావోయిస్టులకు తీరని లోటని అన్నారు. ఏవోబీలోని ఆండ్రపల్లి, జోడాంబో, పనసపుట్టు తదితర ప్రాంతాల్లోని గిరిజనులను భద్రతా దళాలు చిత్రహింసలకు గురిచేస్తున్నాయని, వారిని మావోయిస్టులుగా ముద్ర వేస్తున్నారని కైలాసం ధ్వజమెత్తారు. కటాఫ్‌ ఏరియాలోని వివిధ మండలాల్లో ఈ దురాగతాలు కొనసాగుతున్నాయని తెలిపారు. చుట్టరికం కోసం వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని మావోయిస్టులుగా చిత్రీకరించారని ఆయన మండిపడ్డారు. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో మీనా మృతి చెందలేదని, ఇరు రాష్ట్రాల పోలీసులు కాల్చి చంపారని బంధుమిత్రుల సంఘం ఆరోపించింది.

maoist 15102018 3

ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యల తర్వాత ఆంధ్రా ఒడిశా బోర్డర్‌లో ముమ్మరంగా కూంబింగ్ చేపట్టారు పోలీసులు. బెజ్జింకి ప్రాంతంలోని అడవుల్లో తమకు తారసపడ్డ నక్సల్స్‌పై కాల్పులు జరపడంతో మీనా చనిపోయింది. మీనా మృతికి సంతాపం తెలుపుతూ.. ఇప్పుడు కైలాసం పేరుతో ఆడియో బయటకు వచ్చింది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్య తర్వాత దీనికి కారణాలపై ఇంత వరకూ ఎలాంటి ప్రకటన చేయని మావోయిస్టులు.. మీనా ఎన్‌కౌంటర్‌పై ఆడియో విడుదల చేయడం చర్చనీయాంశమైంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read