మున్సిపల్ ఎన్నికల్లో గెలుపకోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేసిన ప్రభుత్వచర్యలను సమర్థిస్తూ, ప్రభుత్వానికి, అధికారపార్టీకి లేనిపవిత్రతను ఆపాదిస్తూ వైసీపీ ఎమ్మెల్యే జోగిరమేశ్ చాటభారతం చెప్పాడని, టీడీపీ నేత, తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాస రెడ్డి ఎద్దేవాచేశారు. గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీజాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారని, ప్రజలను భయ భ్రాంతులకు గురిచేశారని చెప్పి మాజీమంత్రి కొల్లురవీంద్రను అరెస్ట్ చేయడం అప్రజాస్వామికం కాదాఅని ప్రశ్నిస్తుంటే, దానికి సమాధానం చెప్పకుండా, బీసీలను చంద్రబాబు గౌర వించలేదంటూ, రమేశ్ వ్యాఖ్యానించడం అతనితెలివితక్కువ తనాన్ని సూచిస్తోందన్నారు. తెలుగుదేశంపార్టీ ఆవిర్భావమే బీసీలతో మొదలైందనే వాస్తవం రమేశ్ కు తెలియకపోవడం ఆయనకున్న అవగాహనారాహిత్యానికి నిదర్శనమని మర్రెడ్డి మండిపడ్డారు. కొల్లురవీంద్ర బూత్ లోకి ప్రవేశించాడని, పోలీ సులను అడ్డుకున్నాడని చెబుతున్నరమేశ్, వైసీపీవారు ఏం చేసినా టీడీపీవారెవరూ ప్రశ్నించకూడదనే నియంత్రత్వధోరణి తో మాట్లాడుతున్నాడన్నారు. చట్టంపని చట్టంచేస్తుందని చెబుతున్న రమేశ్, చట్టంలోని పోలీస్ యంత్రాంగం ఏంచేస్తుం దో సమాధానం చెప్పాలని టీడీపీనేత డిమాండ్ చేశారు. పోలీసులుఏం చేస్తున్నారో, వారినిభుజానేసుకొని వైసీపీవారు ఎంతలా రెచ్చిపోతున్నారో జోగి రమేశ్ కు తెలియదా అని మర్రెడ్డి ప్రశ్నించారు. అదేపోలీసులను గతంలో వైసీపీనేతలు, ఎమ్మెల్యేలు నానారకాలుగా దుర్భాషలాడినప్పుడు చట్టం తనపని తానెందుకు చేయలేదో రమేశ్ చెప్పాలన్నారు. వైసీ పీ వారివిషయంలో చట్టానికి చేష్టలుడిగిపోతాయా అన్నారు. స్థానికఎన్నికలనేవి రాజకీయపార్టీల మధ్యజరిగలేదని, వాటిని ఎదుర్కొనేశక్తి లేకనేవైసీపీ అధికారులు, పోలీసులను అడ్డుపెట్టుకొని బయటపడిందన్నారు. చంద్రబాబు లేకుండా పోతారని, టీడీపీ కనుమరుగవుతుందంటున్న రమేశ్, ముం తనపరిస్థితేమిటో, తనపార్టీ పరిస్థితేమిటో తెలుసుకోవాల న్నారు. పోలీసులు, రౌడీలను ఏకంచేయగా ఏర్పడిన అక్రమ శక్తితో ఎన్నికల్లో గెలుపుకోసం వైసీపీప్రయత్నించిందన్నారు.
ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలకువచ్చే ధైర్యంలేకనే అధికార పార్టీ అక్రమశక్తులను నమ్ముకుందన్నారు. 2013లో జరిగిన స్థానికఎన్నికల్లో ప్రజలు ఎవరిపక్షాన ఉన్నారో, రమేశ్ మర్చిపోతే ఎలాగన్నారు. ఓటర్ స్లిప్పుల పంపిణీమొదలు, బూత్ లను ఆక్రమించుకోవడం, బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపచేయడం, పోలీసులు-రౌడీలసాయంతో అభ్య ర్థులను బెదిరించడం వంటి ఘటనలకు ఎవరుపాల్పడ్డారో రమేశ్ సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ అభ్యర్థుల సంతకా లను ఫోర్జరీ చేసి, నామినేషన్లు విత్ డ్రాచేసిన వైసీపీవారికి అభ్యర్థులు లేరో, టీడీపీకిలేరో ఆయనే తెలుసుకోవాలన్నారు. చీకటిపడినతర్వాత లెక్కాపత్రంతో సంబంధంలేకుండా, గెలు పు ఫలితాలుప్రకటించుకొని సంబరాలు చేసుకున్న దిక్కుమాలినవ్యక్తులెవరో ప్రజలకు అర్థమైనా, రమేశ్ కుఅర్థం కాకపోవడం సిగ్గుచేటని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. పట్టణ, నగరాల్లో జరిగే ఎన్నికలు గుర్తుపై జరుగుతాయని తెలిసే, ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్షాన్ని నిలువరిం చిందన్నారు. ఫలితాలు వచ్చేవరకుఆగకుండా, చట్టం గురించి వైసీపీఎమ్మెల్యే మాట్లాడటం దారుణమన్నారు. కర్నూలుజిల్లా ఆదోనిలో రంగన్న అనేవ్యక్తి టీడీపీకి పనిచేశా డన్న అక్కసుతో, అతనికిచెందిన పదెకరాల్లోని కొబ్బరి, టేకు చెట్లను తగలబెట్టినప్పుడు రమేశ్ చెప్పిన చట్టం ఎక్కడుంద న్నారు. రంగన్నకు జరిగిన అన్యాయం చట్టానికి కనిపించలే దా అన్నారు. వైసీపీఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తమ్ముడు టీడీపీకి చెందిన రిలీవింగ్ఏజెంట్లను బూత్ లలోకి వెళ్లకుండా అడ్డుకున్నప్పుడు చట్టంతనపని తానుచేయకుండా ఏంచేసిం దో రమేశ్ చెప్పాలన్నారు.
తెలుగుదేశంపార్టీ అభ్యర్థి పచ్చచొ క్కా వేసుకుంటే, దాన్నినడిరోడ్డుపై బహిరంగంగా విప్పించడ మే చట్టంచేసే పనా అన్నారు. గుంటూరులో వైసీపీనేతలు లేళ్ల అప్పిరెడ్డి, మోదుగుల వేణుగోపాలరెడ్డి బ్యాలెట్ బాక్సు లు బద్దలు కొట్టే ప్రయత్నంచేసినప్పుడు, వారిని అడ్డుకోకుం డా, టీడీపీ మేయర్ అభ్యర్థి కోవెలమూడి నానీని నిలువరించ డమేనా చట్టంచేయాల్సిన పని అని మర్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచే శారు. విజయవాడలో మేయర్ అభ్యర్థిని కేశినేని శ్వేతను పో లీసులు ఎందుకు అడ్డుకున్నారన్నారు. ఆ విధంగా అడుగడు గునా పోలీసులను అరాచకాలకు వాడుకున్న వైసీపీ, ఆపార్టీ ఎమ్మెల్యే చట్టాల గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. అధికారపార్టీ ఎప్పుడూ అరాచకాల గురించే మాట్లాడాలి తప్ప, చట్టాలు, న్యాయాలు అనేపదాలను ఉపయోగించకూ దని మర్రెడ్డి ఎద్దేవాచేశారు. వైసీపీనేతల నరనరాల్లోనే అరాచ కం ఇమిడిఉందన్నారు. చట్టాలు అమలుచేసేవారైతే వందసా ర్లు కోర్టులతో మొట్టికాయలు తినరన్నారు. న్యాయమూర్తుల ను దూషించడం, వ్యతిరేకంగా తీర్పులిచ్చారని వారిపై బురద చల్లడం చేసినవారు, చట్టాలకు అనుగుణంగానే ఆపనిచేశారా అని మర్రెడ్డి నిలదీశారు. కొల్లురవీంద్ర అరెస్ట్, ఆయనపై పెట్టిన కేసులు ముమ్మాటికీ క్షమించరాని అంశాలేనన్న శ్రీనివాస రెడ్డి, ప్రజలను ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిని అక్రమఅరెస్ట్ లతో అడ్డుకోవాలనిచూస్తే, అది పాలకులకే చేటుచేస్తుందన్నా రు. ఎన్నో అక్రమనిర్బంధాలను ప్రజలు ఇప్పటికే చూశారని, ప్రజాస్వామ్యంలో ప్రజలను గౌరవించకుండా, అధికారంలో ఉన్నాంకదా అని ఆగడాలను కొనసాగిస్తే, ప్రజలే తగినవిధం గా బుద్ధి చెబుతారన్నారు. ప్రజస్వామ్యమని, చట్టమని చెప్పే వ్యక్తులు ముందువాటికి లోబడి పనిచేస్తే మంచిదన్నారు. ప్రజలముందు జింకవేషాలేస్తూ, పక్కకొచ్చాక తోడేలు వేషాలే సేవారిని ఎవరూ ఆమోదించరని, కళ్లకు గంతలుకట్టుకొని బ తుకుతున్న వైసీపీనేతలు, ప్రజాస్వామ్యయుతంగా వ్యవహ రించడం నేర్చుకుంటే వారికే మంచిదని శ్రీనివాసరెడ్డి హితవు పలికారు.