ఓటుకు నోటు కేసు పునఃసమీక్షించిన కేసీఆర్‌కు, జెరూసలెం మత్తయ్య ధన్యవాదాలు చెప్పారు... ఈ రోజు మీడియా సమావేశం ఉంటుంది అని, ఆ సమావేశంలో చంద్రబాబు, రేవంత్ పై మత్తయ్య ఆరోపణలు చేస్తారని మీడియాకు లీకులు ఇచ్చాయి తెలంగాణా వర్గాలు.. అయితే, మత్తయ్య మాత్రం రివర్స్ లో అటు, కేసీఆర్, కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేసాడు. తనను కోవర్టుగా మార్చడానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ గన్ మెన్ ప్రయత్నం చేశాడని, తాను అందుకు ఒప్పుకోలేదని, కోవర్టుగా మారకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని అతను బెదిరించాడని మత్తయ్య పేర్కొన్నాడు. క్రిష్టియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే ను మాత్రమే బలిపశువును చేయడానికి చూశారని, తాను వారు చెప్పినట్టు వినలేదు కాబట్టే తన తమ్ముడి బంధువులను కొట్టించారని మత్తయ్య చెప్పాడు.

mattayya 08052018 2

ఓటుకు నోటు కేసుతో పాటు.. పోన్ టాపింగ్ పై విచారణ ఎందుకు జరగడం లేదని ఆయన అన్నారు.. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌కు మత్తయ్య పది ప్రశ్నలు సంధించారు.. 1.ఓటుకు నోటు కేసుతో పాటు.. పోన్ టాపింగ్ పై కూడా దర్యాప్తు జరగాలి... 2. ఎమ్మల్సీ ఎన్నికల్లో అన్ని పార్టీలు, ఎమ్మల్యేలను కొనటానికి చూసాయి, మీ ట్యాపింగ్ లో ఆ విషయం బయట పడింది కదా, అందరి మీద దర్యాప్తు చెయ్యండి...3. నీ కుమారుడు కేటీఆర్, ఇద్దరు మంత్రులు, ఇద్దరు మీడియా ప్రతినిధులు, నాకు ఎందుకు డబ్బులు పంపారో, సమగ్ర దర్యాప్తు చెయ్యాలి... 4. చంద్రబాబు పేరు చెప్పలేదని, నా బంధువలని ఎందుకు కొట్టించావు ? దాని పై కూడా విచారణ జరిపించు... 5.క్రిష్టియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే ను మాత్రమే ఎందుకు బలిపశువును చెయ్యటానికి చూస్తున్నారు ?

mattayya 08052018 3

6. కోర్ట్ కి పంపించ వలసిన స్టింగ్ ఆపరేషన్ వీడియోలు, కేవలం టీ న్యూస్, సాక్షి కి మాత్రమే ఎందుకు పంపారు ? ఏసిబి పై ఈ విషయంలో మీరు తీసుకున్న చర్యలు ఏమిటి ? 7. మిగతా ఎమ్మల్యేలు కూడా ఈ స్టింగ్ ఆపరేషన్ లో ఉంటే, కేవలం క్రిష్టియన్ నామినేటెడ్ ఎమ్మెల్యే ను , ఎందుకు టార్గెట్ చేసారు ? 8. నన్ను నీ కొడుకు బెదిరించాడు, దాంట్లో నీ పాత్ర ఏంటి ? ఏపి ప్రభుత్వం ఇచ్చిన నోటీసు తీసుకోకుండా ఎందుకు పారిపోయావు ? 9. ఫోన్ ట్యాపింగ్ పై, RTI వేసినా ఎందుకు ఇవ్వలేదు ? 10.ఈ వివాదంలో ప్రాధాన పాత్రదారి జిమ్మిబాబుని ఎందుకు విచారించలేదు ?

Advertisements

Advertisements

Latest Articles

Most Read