జగన్ మోహన్ రెడ్డితో కలిసి వెళ్ళటానికి, తహతహలాడుతున్న నరేంద్ర మోడీకి, జగన్ తో కలవక ముందే, 70mm సినిమా కనిపిస్తుంది... మనోడి రేంజ్ ఏంటో తెలిసి కూడా, అలాంటి వాడితో స్నేహ హస్తం కోసం, తపించిపోతున్న మోడీకి, ఇది షాక్ లాంటిందే... జగన్ చేసిన దోపిడీ ఎఫెక్ట్ వల్ల, మోడీకే కాదు, మరో ముగ్గురు కేంద్ర మంత్రులకు కూడా చుట్టుకుంది... అప్పుడెప్పుడో జగన్ చేసిన స్కాంలు, ఇప్పుడు మోడీ, కేంద్ర మంత్రులకు చుట్టుకోవటం ఏంటి అనుకుంటున్నారా ? దీని వెనుక పెద్ద స్టొరీనే ఉంది... ఒక రకంగా చెప్పాలంటే, జగన్ లాంటి వాడితో స్నేహం ఎంత ప్రమాదమో, మోడీకి ముందే తెలిసేలా చేసింది విధి... మరి, మోడీ, ఇప్పటికైనా మారతారో లేదో చూడాలి...
వివరాల్లోకి వెళ్తే, ఇందూ టెక్ సెజ్ లో, మనోడు సిబిఐ కేసులో బుక్ అయ్యి ఉన్నాడు.. ఇదో పెద్ద స్కాం అని, ఇందు శ్యాం ప్రసాద్ రెడ్డి, వైఎస్ఆర్, జగన్ ఎలా దోచింది, సిబిఐ ఇప్పటికే ఎస్టాబ్లిష్ చేసింది... ఇందు శ్యాం ప్రసాద్ రెడ్డికి భూములు అప్పగించి, ఆ భూములు తాకట్టు పెట్టి, మొండి లాండరింగ్ ద్వారా జగన్ కంపనీలలో పెట్టుబడులు పెట్టారని, సిబిఐ బుక్ చేసేంది... అయితే, మారిషస్ కి చెందిన Carissa Investments LLC అనే కంపెనీ ఇందూ టెక్ సెజ్ లో, 49% వాటా కలిగి ఉండి, FDI ద్వారా పెట్టుబడులు పెట్టింది...
జగన్ ఇందూ టెక్ సెజ్ లో స్కాం చేసాడు అని తేలటంతో, ఇప్పుడు అది ముందు వెళ్లకపోవటంతో, Carissa Investments, మారిషస్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది.. ఇరు దేశాలకు సంబందించింది కాబట్టి, మారిషస్ ప్రభుత్వం, ఇంటర్నేషనల్ కోర్ట్ లో ఫిర్యాదు చేసింది... Carissa Investmentsని మోసం చేసారని, 50 మిలియన్ డాలర్లు పరిహారం చెల్లించమని కోరింది... దీంతో, ఇంటర్నేషనల్ కోర్ట్ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, ఫైనాన్సు మినిస్టర్, లా మినిస్టర్, కామర్స్ మినిస్టర్, అర్బన్ అఫైర్స్ మినిస్టర్ కు నోటీసులు జారీ చేసింది... జగన్ చేసిన స్కాం వల్ల, ఇప్పుడు ప్రధాని, నలుగురు కేంద్ర మంత్రులు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది...