మెఘా కృష్ణ రెడ్డి ఇంట్లో ఐదవ రోజు ఐటీ అధికారుల సోదాలు, విచారణ కొనసాగిస్తున్నారు. ఐదు రోజుల సెర్చ్ వారెంట్ తో వచ్చిన అధికారులు, తమ పని వేగం పెంచారు. ఇలాగే అయుదు రోజులు ఒకే చోట, ఒకే ఇంట్లో ఐటి సోదాలు, విచారణ జరగటం అనేది చాలా అరుదు. ఇక్కడే ఈ కేసు తీవ్రత ఏమిటో అర్ధమవుతుంది. ఈ సోదాల్లో, పలు కీలక డాక్యుమెంట్ లను స్వాదీనం చేసుకున్న అధికారులు, ఆర్ధిక లావాదేవీల్లో అవకతవకలు ఉన్నట్టు గుర్తించారు. మేఘ కృష్ణా రెడ్డి నివాసంలో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్ తో బాలానగర్ లోని వివిధ బ్యాంక్ లకు తరలించి అక్కడ లాకర్లు తనిఖీ చేసారు. మరో పక్క, ఈ రోజంతా మెఘా కృష్ణారెడ్డి, పిచ్చిరెడ్డిని వేర్వేరుగా విచారించటంతో పాటు, ఉమ్మడిగాను విచారించే అవకాశం కనపడుతోంది. గత నాలుగు రోజుల సోదాల ఆధారంగా ఈ విచారణ ఉండబోతుంది. ముఖ్యంగా మనీలాండరింగ్ జరిగిందని, ఐటీకి బలమైన సాక్ష్యాధారాలు దొరికినట్లు సమాచారం.

megha 15102019 2

ఇక మరో పక్క తెలంగాణా గవర్నర్ ఉన్నట్టు ఉండి ఢిల్లీ వెళ్ళటం ఆసక్తి రేపుతుంది. ఈ కేసులో పెద్ద తలకాయల ప్రమేయం బయట పడిందని, వారి అరెస్ట్ లు ఉంటాయనే ప్రచారం మధ్య, గవర్నర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మెఘా అరెస్ట్‌ తో పాటు, పలువురు ప్రముఖులు కూడా అరెస్ట్ ఉంటుంది అనే వార్తలు వస్తున్న నేపథ్యంలో, రాష్ట్రంలో పరిస్థితుల పై కేంద్ర హోంశాఖ గవర్నర్‌ ని పిలిపించుకుని, ఆరా తీస్తున్నట్టు తెలుస్తుంది. ఆర్టీసీ స్ట్రైక్ విషయంలో, ఆమె ఢిల్లీ వెళ్ళారనే ప్రచారం ఉన్నా, అంతకు మించి ఏదో జరుగుతంది అనే ప్రచారం జరుగుతుంది. ఈ రోజు మధ్యహ్నం 12గంటలకు డిల్లీ బయలుదేరనున్న గవర్నర్, మద్యాహ్నం 3 గంటలకు ప్రధాని నరేంద్రమోడీతో, 4గంటలకు బీజేపీ అద్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ కాబోతున్నారు.

megha 15102019 3

నాలుగు రోజుల పాటు, సోదాలు, విచారణ జరిపిన ఐటి అధికారులు, నిన్న బ్యాంకులు, లాకర్లను కూడా తెరిపించటంతో, కీలక ఆధారాలు దొరికాయనే ప్రచారం జరుగుతుంది. బాలానగర్ ఆంధ్రబ్యాంక్ , బొల్లారంలోని ఐడీబీఐ బ్యాంక్, కోటాక్ బ్యాంకుల్లోని ఖాతాల వివరాల్ని సేకరించి, లాకర్లలో దొరికిన వివిద పత్రాలను విశ్లేషించే పనిలో ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో, మనీ లాండరింగ్ చుట్టూ తిరుగుతుందని, ఈడీ కూడా రంగంలోకి దిగుతుందని, రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. ఈడీ కూడా రంగంలోకి దిగితే, మరిన్ని కష్టాలు తప్పవు. ఇక మరో పక్క, మేఘా ఇంటి ముందు, కార్యాలయం ముందు ఉన్న మీడియా పై, మెఘా అనుచరులు, మీడియాపై దౌర్జన్యానికి దిగుతున్నారు. ఇక్కడ ఏమి షూట్ చెయ్యొద్దు అంటూ దౌర్జన్యం చేస్తున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read