తెలుగు ప్రజలందరికీ సుపరచితమైన టీవీ9 న్యూస్ ఛానల్, బడా కాంట్రాక్టర్ చేతిలోకి వెళ్తుంది అంటూ గత కొన్ని రోజులుగా పుకార్లు వచ్చాయి. అయితే ఈ రోజు అన్ని పత్రికల్లో ఈ వార్త రావటంతో, ఇది నిజమే అని తేలిపోయింది. మేఘా ఇంజనీరింగ్‌ గ్రూపు, టీవీ9 ని కొనుగులు చేసింది అంటూ వార్తలు వచ్చయి. మేఘా ఇంజనీరింగ్‌ గ్రూపు, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ కాంట్రాక్టర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టిసీమ లాంటి ప్రాజెక్ట్ లు, తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కడుతున్న సంస్థ. ప్రస్తుతం టీవీ9 శ్రీని రాజు చేతిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు టీవీ9 ని,మేఘా ఇంజనీరింగ్‌ గ్రూపు కొనుగోలు చేసిందని, 500 కోట్లకు డీల్ జరిగినట్టు, ప్రముఖ పత్రికల్లో వార్తలు వచ్చాయి.

megha 22082018 2

దీనిపై గత కొంతకాలంగా సాగుతున్న సంప్రదింపులు ఒక కొలిక్కి వచ్చినట్లు, త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందని విశ్వసనీయంగా తెలిసింది. టీవీ9 కు తెలుగుతో పాటు కన్నడ, గుజరాతీ, మరాఠీ ఛానళ్లు ఉన్నాయి. ఈ ఛానల్‌ యాజమాన్య సంస్థ అయిన అసోసియేటెడ్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ కంపెనీలో పారిశ్రామికవేత్త, వెంచర్‌ కేపిటలిస్ట్‌ అయిన శ్రీనిరాజుకు చెందిన వివిధ సంస్థలకు మెజార్టీ వాటా ఉంది. దీన్ని కొనుగోలు చేయటానికి గత కొంతకాలంగా పలు సంస్థలు ముందుకు వచ్చినట్లు, వాటితో చర్చలు సాగినట్లు సమాచారం. కానీ ఏవో కారణాల వల్ల ఆ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు.

megha 22082018 3

ఇప్పుడు మేఘా ఇంజనీరింగ్‌ గ్రూపుతో విక్రయ ఒప్పందం ఖరారు కానుందని అంటున్నారు. ఈ లావాదేవీ విలువ, ఇతర వివరాలు వెల్లడి కావటం లేదు. 2004లో టీవీ 9 ప్రారంభం అయ్యింది. అప్పటి నుంచి, తెలుగులో, అధిక టీఆర్పీ రేటింగ్స్ తో ముందు ఉంటుంది. ఈ మధ్య మరీ వివాదాస్పద ప్రోగ్రాంలు వేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. పవన్ కళ్యాణ్ అయితే, డైరెక్ట్ గా టీవీ9 యాజమాన్యం పై ట్వీట్లు వేసారు. ఇలా అనేక వివాదాలు నడుమ, ఇప్పుడు టీవీ9 చేతులు మారుతుంది. మరో విశేషం ఏమి అంటే, మేఘ గ్రూప్ లో, కెసిఆర్ సన్నిహితుడు, మై హోం గ్రూప్ అధినేత, జూపల్లి రామేశ్వర రావు కూడా భాగస్వామ్యుడు. అంటే, ఇప్పుడు చేతులు మారినా, మన ఆంధ్రా వైపు మొగ్గే అవకాసం లేదు. ఇప్ప్పటి లాగే, తెలంగాణా భజన చేస్తూ, ఆంధ్రా పై సవతి తల్లి ప్రేమ కొనసాగిస్తారేమో మరి. చూద్దాం...

Advertisements

Advertisements

Latest Articles

Most Read