ఒక పక్క అధికార వైసీపీ పార్టీ నేతలు, ప్రభుత్వ పెద్దలు, ఈ రాష్ట్రాన్ని సుందరవనంగా మార్చేస్తున్నాం, ఈ రాష్ట్ర రూపు రేఖలు మార్చేస్తున్నాం అని చెప్తుంటే, ఏకంగా ఒక మంత్రి నుంచే ఫిర్యాదు రావటం, అది కూడా ఒక అధికారి సహకరించటం లేదు అని చెప్పటం సంచలనంగా మారింది. ఇది నెల్లూరు జిల్లాలో జరిగిన విషయం. అక్కడ మంత్రి అనిల్ కుమార్ తో పాటుగా, కమీషనర్ దినేష్ కుమార్, నెల్లూరు జిల్లాలో పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం అని, వివిధ కార్యక్రమాలు ప్రకటించారు. అయితే ఓ మున్సిపల్ అధికారి మాత్రం, ఏకంగా మంత్రి గారు చెప్పిన మాట కూడా వినటం లేదు అంట. ఆ మంత్రి రాష్ట్ర ఐటి శాఖా మంత్రి మేకపాటి గౌతం రెడ్డి. ఇదే విషయాన్ని ఆయన, జిల్లా కలెక్టర్ కు లేఖ రాసి, జరిగిన విషయం చెప్పారు. గత కొన్ని రోజులుగా తన క్యాంప్ ఆఫీస్ దగ్గర, పారిశుధ్యం సరిగా ఉండటం లేదని, దాని పై తగు చర్యలు తీసుకోవాలని ఎంత చెప్పినా, అధికారి స్పందించటం లేదని, మేకపాటి గౌతం రెడ్డి, విషయాన్ని కలెక్టర్ వద్దకు తీసుకు వెళ్లారు. దీనికి సంబంధించి, ఆయన కలెక్టర్ కు లేఖ రాసారు.

నెల్లూరులో ఉన్న పొదలకూరు రోడ్డులో, మంత్రి మేకపాటి గౌతం రెడ్డికి క్యాంపు కార్యాలయం ఉంది. అయితే అక్కడ గత కొన్ని రోజులుగా శుభ్రత సరిగ్గా లేదని, పరిసరాలన్నీ అధ్వాన్నంగా ఉన్నాయని, మంత్రి కార్యాలయ సిబ్బని, మున్సిపల్ హెల్త్ అధికారి వెంకట రమణకు ఫిర్యాదు చేసారు. ఒకసారి కాదు, అనేక సార్లు ఆ అధికారికి, జరిగిన విషయం చెప్పారు. అయినా ఆ అధికారి నుంచి ఎలాంటి స్పందన కానీ, అక్కడ గ్రౌండ్ లో ఆక్షన్ కానే లేదు. అయితే విషయం మంత్రి మేకపాటికి తెలియటంతో, ఆయనే స్వయంగా, ఆ అధికారికి ఫోన్ చేసి, తన వద్దకు రావాలని ఆదేశించారు. అయినా మంత్రి మాట కూడా పట్టించుకోక పోవటంతో, చివరకు మంత్రి మేకపాటి, కలెక్టర్ కు ఫిర్యాదు చేసి, జరిగిన విషయం చెప్పారు. ఇది రాష్ట్రంలో తీరు. ఒక మంత్రికే ఈ పరిస్థతి ఉందంటే, పరిస్థితి ఎలా ఆందో అర్ధం చేసుకోవచ్చు. కొంత మంది అధికారుల వల్ల, నిజంగా కష్టపడే నాయకులకు కూడా ఇబ్బంది అవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read