50 రోజుల్లోనే జగన్ మోహన్ రెడ్డికి చుక్కలు కనిపిస్తున్నాయి. తాడేపల్లిలోని జగన ఇంటి దగ్గర, మొన్నటి వరకు ధర్నాలతో దద్దరిల్లింది. అయితే, జగన్ మోహన్ రెడ్డి ఇంటి దగ్గరకు ఎవరినీ రానియ్యకుండా 144 సెక్షన్ పెట్టారు. దీంతో ఆందోళనకారులు, మేము ఏదైనా సమస్య చెప్పాలన్నా చెప్పనివ్వరా అంటూ ఆందోళన వ్యక్తం చెయ్యటంతో, విజయవాడ లెనిన్ సెంటర్ లోని ధర్నా చౌక్ లో, ఆందోళన చేసుకొండి అని చెప్పారు. అయితే జగన్ మోహన్ రెడ్డికి కనీసం మా సమస్య ఇది అని చెప్పే వీలు ఇక్కడ ఉంటుందని, ఎక్కడో విజయవాడలో చేస్తే, జగన్ కు కనీసం మా సమస్య ఏంటో కూడా తెలియదని చెప్పినా, పోలీసులు మాత్రం, జగన్ ఇంటి వద్దకు ఎవరినీ పంపటం లేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో, ఆందోళన చెయ్యాలి అంటే, అందరూ విజయవాడ ధర్నా చౌక్ దగ్గరకే వెళ్తున్నారు

midday 22072019 2

ఈ నేపధ్యంలోనే ఈ రోజు మ‌ధ్నాహ్న భోజ‌న కార్మికులు ఆందోళన చేసారు. జగన్ మాకు తీరని అన్యాయం చేసారని, మాట తప్పను, మడం తిప్పను అని చెప్పి, మాకు ఇచ్చిన హామీని పూర్తిగా విస్మరించారని ఆందోళన వ్యక్తం చేసారు. పాదయాత్ర సందర్భంలో జగన్ మోహన్ రెడ్డి మాకు హామీ ఇచ్చారని, అయితే ఆ హామీకి భిన్నంగా ఇప్పుడు వ్యవహరిస్తున్నారని మండి పడ్డారు. మ‌ధ్నాహ్న భోజ‌న కార్మికులును కాదని, స్వచ్చంద సంస్థలకు ఇస్తున్నారని, రేపటి నుంచి మేము ఏమి చెయ్యాలని అని ఆందోళన వ్యక్తం చేసారు. అసెంబ్లీలో మా సమస్యల పై ప్రశ్నలు వస్తున్నా, మంత్రులు ఎవరు సరైన సమాధానం చెప్పటం లేదని, మేము ఇంకా ఎవరికీ చెప్పుకోవాలని ఆందోళన వ్యక్తం చేసారు. కనీసం జీతాలు కూడా ఇవ్వటం లేదని అన్నారు.

midday 22072019 3

ప్రభుత్వం వచ్చి మూడు నెలలు అవుతున్నా, మ‌ధ్నాహ్న భోజ‌న ప‌ధ‌కం కార్మికుల‌కు ఇవ్వాల్సిన గౌర‌వ వేత‌నం ఇవ్వ‌లేదని ఆరోపించారు. జగన్ హామీ విస్మరించారని, అందుకే ఈ రోజు చలో విజయవాడ కార్యక్రమాన్ని చేపదుతున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మ‌ధ్నాహ్న భోజ‌న ప‌ధ‌కం కార్మికులు, ముందుగా పిలుపి ఇచ్చినట్టుగానే, విజయవాడ వచ్చారు. అయతే సభ ముగిసిన వెంటనే, చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపు ఇచ్చారు. దీంతో ఈ పరిణామంతో పోలీసులు కంగుతిన్నారు. వెంటనే వారిని అరెస్ట్ చేసారు. మహిళలు అని కూడా చూడకుండా లాగి అవతల పడేసారు. పాదయాత్రలో నేను ఉన్నాను, నేను విన్నాను అని చెప్పి, ఇప్పుడు అధికారం రాగానే, ఈడ్చి పడేస్తున్నారని, ఈ విషయంలో జగన్ సానుకూల ప్రకటన చెయ్యకపోతే, తీవ్ర ఆందోళన చేస్తామని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read