అందాల విశాఖతీరం..ఐటీ మణిహారంగా భాసిల్లుతోంది. మిలీనియం టవర్ ప్రారంభంతో ఐటీలో మరోమైలురాయికి విశాఖ చేరుకోనుంది. ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ల శాఖ పర్యవేక్షణలో మధురవాడ హిల్ నెంబర్ 3లో నిర్మాణం పూర్తి చేసుకున్న మిలీనియం టవర్ ని గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ హాజరయ్యారు. మిలీనియం టవర్‌లో ఏర్పాటైన కాడ్యుయెంట్ కంపెనీ తన కార్యకలాపాలను లాంఛనంగా ప్రారంభించింది. కాడ్యుయెంట్‌లో 1600 మందికి ఉద్యోగాలు కల్పించారు. ఏడాదిలోగా 4,500 మందికి ఉద్యోగాలు కల్పనే లక్ష్యమని కంపెనీ ప్రకటించింది.
నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.145 కోట్లతో నిర్మించిన మిలీనియం టవర్ ని ఏడంతస్తులలో నిర్మించారు. విశాఖ అందాలకు ధీటుగా సర్వాంగసుందరంగా నిర్మాణం పూర్తి చేసుకున్న మిలీనియం టవర్ ..ఏపీలో ఐటీ రంగ అభివృద్ధికి ఐకాన్‌గా నిలవనుంది. ఈ టవర్‌లోనే కాడ్యుయెంట్ కంపెనీ కార్యకలాపాలు కూడా ఆరంభం కానున్నాయి. తొలి దశలో 1600 మందికి ఉద్యోగులతో మొదలై...ఏడాదిలోగా 4,500 మందికి ఉద్యోగాలు కల్పన లక్ష్యంగా కంపెనీ ప్రకటించింది. నాలుగు ఎకరాల విస్తీర్ణంలో రూ.145 కోట్లతో నిర్మించిన మిలీనియం టవర్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ఏడంతస్తులుగా నిర్మించారు.ఈ టవర్‌లో కాడ్యుయెంట్ కంపెనీ కార్యకలాపాలు కొనసాగనున్నాయి.
2 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్న ఈ టవర్ ప్రారంభానికి ముస్తాబయ్యింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలలో ఆంధ్రప్రదేశ్‌ని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు మంత్రి నారా లోకేశ్ చేస్తున్న కృషితో ఒక్కో కంపెనీ ఏపీ బాట పడుతోంది. ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నాయి. ఏపీ ఐటీ రాజధానిగా పేరుపడిన విశాఖలో ఒకే రోజు అదాని డేటా పార్క్‌కు భూమి పూజ, మిలీనియం టవర్ ప్రారంభం, ఇందులోనే కాడ్యుయెంట్ కంపెనీ కార్యకలాపాల ఆరంభం కానుండటంతో సందడి వాతావరణం నెలకొంది.