విధి నిర్వహణలోనే కాదు, సాటి మనుషులను కాపదతంలోను ముందు ఉంటున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు... ఈ మధ్య కోడెల శివ ప్రసాద్, పరిటాల సునీత, రోడ్ మీద ఆక్సిడెంట్ అయిన వారిని కాపాడి, స్వయంగా హాస్పిటల్ కు తీసుకువెళ్లటం చూసాం, ఇప్పుడు అదే విధంగా మానవత్వాన్ని చాటుకున్నారు మరో మంత్రి జవహర్.. విధి నిర్వహణలో భాగంగా రోడ్ పై వెళ్తూ ఉండగా, అక్కడ జరిగిన ఆక్సిడెంట్ చూసి, వెంటనే రంగంలోకి దిగి, ఒక నిండు ప్రాణం కాపాడారు... అ టైంకి, మంత్రి అటుగా వెళ్లి ఉండకపోతే, ఎవరూ ఆ మనిషిని రక్షించి ఉండే వారు కాదు... సరైన సమయంలో వెళ్లి, ఒక నిండు ప్రాణాన్ని కాపాడి, మానవత్వం నిలబెట్టుకున్నారు మంత్రి.. వివరాలు ఇలా ఉన్నాయి...
కొవ్వూరు మండలం నందమూరు సమీపంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రమాదవశాత్తూ ఆటో కాల్వలో బోల్తా పడింది. చేబ్రోలుకు చెందిన ఆటో డ్రైవర్ కామిశెట్టి వీర వెంకట సత్యనారాయణ దొమ్మేరు జాతరకు వచ్చి తిరిగి వెళ్తుండగా ఆటో కాల్వలోకి బోల్తా కొట్టింది. అదే సమయంలో అటుగా వస్తున్న మంత్రి జవహర్ ప్రమాదాన్ని చూసి కాన్వాయ్ ఆపించి మంత్రి స్వయంగా సిబ్బంది, పోలీసులతో కలసి సహాయక చర్యలు చేపట్టారు. ఆటోను పైకి తీసి డ్రైవర్‌ను కాపాడారు.
అపస్మారక స్థితిలో ఉన్న డ్రైవర్ సత్యనారాయణను పట్టణ ఎస్‌ఐ రమేష్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం సత్యనారాయణను భార్య, బంధువులు ఇంటికి తీసుకెళ్లినట్టు ఎస్‌ఐ తెలిపారు.. అయితే, మంత్రి అక్కడకు వెళ్ళిన సమయంలో, ఆటో లేపటానికి మనుషులు సరిపోకపోతే, మంత్రి జవహర్ అక్కడ ఉన్న మిగతా సెక్యూరిటీ వారితో కలిసి, స్వయంగా ఆటోను పక్కకు తీసారని తెలుస్తుంది.. ఏది ఏమైనా, ఒక మంచి పని చేసి, ఒక నిండు ప్రాణాన్ని కాపాడిన జవహర్ గారికి కృతజ్ఞతలు...