మంత్రివర్గ చేర్పులు, మార్పుల సందర్భంగా మంత్రి పదవి కోల్పోయిన కొడాలి నానిని మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకుంటారని జోరుగా ప్రచారం సాగుతోంది. దీనికి ఊతం ఇచ్చేలా నాని రోజూ మీడియా ముందుకు వచ్చి గతంకంటే ఘోరమైన బూతులతో టిడిపిపై విరుచుకుపడుతున్నాడు. కొత్తగా మంత్రులు అయినవారు కానీ, గతం నుంచి కొనసాగుతున్న వారు కానీ..వైసీపీ పెద్దలు ఆశించిన స్థాయిలో బూతులు మాట్లాడటంలేదని తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. నిత్యమూ టిడిపిని టార్గెట్ చేయాలంటే కొడాలి నాని కరెక్ట్ అని, ఏం బూతులు మాట్లాడమంటే అవే మాట్లాడుతున్న నానికి మంత్రి పదవి లేకపోవడంతో కవరేజ్ వీక్‌గా ఉందట. అందుకే మంత్రిని చేస్తే మరింతగా బూతులతో టిడిపిపై విరుచుపడేందుకు ఉపయోగపడతాడని వైసీపీ అధిష్టానం ఆలోచిస్తోందని సమాచారం. మంత్రివర్గంలో కొందరిని కొత్తవాళ్లను తీసుకుంటారని వార్తలు వచ్చాయి. అప్పటి నుంచీ కొడాలి నాని మీడియా ముందుకొస్తూ మళ్లీ నోరుపారేసుకోవడం చూసి, మంత్రిగా కొడాలిని తీసుకుంటారని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. దీనిపై తాడేపల్లి ప్యాలెస్‌లో ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, బాలినేని శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డితో మంతనాలు సాగించారని సమాచారం. బూతులు తిట్టే సామర్థ్యం కొడాలి నానికి మంత్రి పదవికి తొలి అర్హత కాగా, కొడాలి నాని రోజూ తిట్టుకునే తన సామాజికవర్గం సమీకరణం కలిసొచ్చిందని తెలుస్తోంది. కమ్మ సామాజికవర్గం నుంచి ఎవరూ మంత్రివర్గంలో లేరని, కొడాలి నానిని మళ్లీ కేబినెట్లోకి తీసుకుంటే అటు కమ్మ ప్రాతినిధ్యం ఇచ్చినట్టవుతుందని, మళ్లీ బూతులు తిట్టే మంత్రి వచ్చేసినట్టుంటుందని ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.
కొడాలి నానికి మళ్లీ మంత్రి పదవి ఇస్తున్న జగన్ ? బూతుల డోస్ పెంచేశాడా?
Advertisements