ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుక దుమారం చెలరేగుతూనే ఉంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో, ఇసుక కుంభకోణం జరిగింది అని, తెలుగుదేశం నేతలు ఇసుకని తినేస్తున్నారు అంటూ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. కాని అప్పట్లో ట్రాక్టర ఇసుక వెయ్యి నుంచి 1500 ఉండేది. అంత రేటు ఉంటేనే మోసం, అన్యాయం, స్కాం అంటూ అప్పటి ప్రతిపక్షం ప్రచారం చేసింది. అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీ, వచ్చిన దగ్గర నుంచి ఇసుక అందుబాటులో లేకుండా పోయింది. చంద్రబాబబు హయాంలో ఉన్న ఉచిత ఇసుక రద్దు చేసారు. కొత్త పాలిసీ తెస్తున్నామని, ఇసుక ఆపేశారు. దాదపుగా నాలుగు అయదు నెలలు అసలు ఇసుక రాలేదు. దీంతో, అన్ని రంగాలు దెబ్బ తిన్నాయి. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారు. తరువాత ఇసుక పాలసీ వచ్చింది. అయినా రేటు మాత్రం అందుబాటులో లేదు. వేలకు వేలు పెడితే కానీ రాని పరిస్థితి. అయితే డబ్బులు పెట్టినా ఇసుక రాని పరిస్థితి ఉంది. బుక్ చేసుకున్న రెండు మూడు నెలలకు కూడా రావటం లేదు. వచ్చినా నాసిరకం ఇసుక వస్తుంది. స్వయంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ విషయం పై బహిరంగంగానే ప్రభుత్వం పై విమర్శలు చేసారు. ఇసుక రీచ్ లో నుంచి, డెలివరీ పాయింట్ కు రాకుండా, మధ్యలోనే మాయం అవుతుందని ప్రజాప్రతినిధులే ఆరోపించారు.

అయితే ఇప్పుడు ఈ ఇసుక బాధితుల్లో ఇప్పుడు అధికార పార్టీ మంత్రి చేరారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ కు, ఇసుక షాక్ తగిలింది. మంత్రిగారు భట్నవిల్లిలో తనకు ఉన్న స్థలంలో, ఇల్లు నిర్మాణం మొదలు పెట్టారు. ఆయన ఆన్లైన్ లో, నాలుగు లారీలు ఇసుకను బుక్ చేసుకున్నారు. అయితే డెలివర్ అయిన ఇసుక చూసి, సైట్ ఇంచార్జ్ షాక్ అయ్యారు. వచ్చిన ఇసుకలో, మట్టి కూడా కలిసి ఉంది. దీంతో ఆ సైట్ ఇంచార్జ్ విషయం మంత్రిగారికి చెప్పారు. దీంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసారు, నాకే ఇలా ఉంటె, సామన్యులకు ఎలా ఉందో అంటూ, జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేసారు. దీంతో అమలాపురం ఆర్టీవో భవానీశంకర్ వచ్చి, ఇసుక పరిశీలించి, జరిగింది నిజమే అని కలెక్టర్ కు నివేదించారు. ప్రజలకు నాణ్యమైన ఇసుక అందించాలని, మంత్రి, కలెక్టర్ ని ఆదేశించారు. అయితే ఏకంగా మంత్రికే ఈ పరిస్థితి రావటం పై, రాష్ట్రంలో ఇసక పరిస్థితి ఎలా ఉందో అర్ధం అవుతుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read