జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలను ఆయన సహచర మంత్రులు పట్టించుకోవటం లేదు. జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, మంత్రుల పేషీల్లో సిబ్బంది పై కొన్ని సూచనలు చేసారు. ఈ విషయం పై మొదటి క్యాబినెట్ సమావేశంలోనే, మంత్రులకు తగిన సూచనలు ఇచ్చారు. అయితే ఈ సూచనలు ఇచ్చి రెండు నెలలు అవుతున్నా, ఆయన మాటలను మాత్రం, మెజారిటీ మంత్రులు పాటించటం లేదు. ముఖ్యమంత్రి హోదాలో సూచనలు, ఆదేశాలు ఇచ్చినా, మంత్రులు మాత్రం డోంట్ కేర్ అనటం, కొంచెం విడ్డురంగా కనిపిస్తుంది. ఒక పక్క జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగిన పనుల పై, చంద్రబాబు పై, అప్పటి మంత్రులు పై, ఎలా అయినా విచారణ చేసి, వారిని ఇబ్బంది పెట్టాలని చూస్తుంటే, జగన్ మంత్రులు మాత్రం, వేరే రూట్ లో వెళ్తున్నారు.

ministers 10082019 2

జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే, చంద్రబాబు హయమలో కీలకంగా ఉన్న ఉన్నతాధికారులను తొలగించారు. కొంత మందిని ట్రాన్స్ఫర్ చేస్తే, మరి కొంత మందికి ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వలేదు. మరో పక్క, తన దగ్గర ఎలా అయితే మార్పులు చేసారో, మంత్రులకు కూడా అలాంటి ఆదేసాలే ఇచ్చారు. గత ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖల పేషీల్లో ఉన్న వారిని, ఇప్పుడు మంత్రులు ఎవరూ పెట్టుకోవద్దని, అందరినీ తప్పించాలని జగన్ మొదట్లోనే ఆదేశాలు ఇచ్చారు. దీని పై ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి, అందరి మంత్రులకు ఒక నోట్ కూడా వెళ్ళింది. పోయిన సారి ఉన్న సిబ్బందిని కాని, వారి బంధువులను కాని, పేషీల్లో ఉంచద్దు అంటూ మంత్రులకు ఆదేశాలు వెళ్ళాయి. అయితే కొంత మంది మంత్రులు మాత్రం, జగన్ మాటను ఇప్పటికీ లెక్క చెయ్యలేదు.

ministers 10082019 3

స్వయానా జగన్ చెప్పినా, ఇంకా కొంత మంది మంత్రులు మాత్రం, తెలుగుదేశం హయంలో ఉన్న వారినే తమ సిబ్బందిగా కొనసాగిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర ఉన్నారు. బుగ్గన పీఎస్ గా పని చేస్తున్న ధనుంజయ్ రెడ్డి, గత తెలుగుదేశం హయంలో మంత్రిగా ఉన్న కాల్వ శ్రీనివాసులు దగ్గర పీఎస్ గా పని చేసారు. అలాగే కాల్వ శ్రీనివాసులు దగ్గర ఓఎస్డీగా పని చేసిన సత్యన్నారాయణ కూడా, ప్రస్తుతం హోం మినిస్టర్ వద్ద ఓఎస్డీగా పని చేస్తున్నారు. అలాగే పరిటాల సునీత వద్ద ఉన్న ఓఎస్డీ రామచంద్రా రెడ్డి, బుగ్గన ఓఎస్డీగా ఉన్నారు. ఇలా మొత్తం 13 మంది మంత్రులకు, గతంలో టిడిపి మంత్రుల దగ్గర పని చేసిన సిబ్బందే ఉన్నారు. అయితే, దీని పై జగన్ కు ఫిర్యాదు వెళ్ళింది. ప్రభుత్వ రహస్యాలు అన్నీ టిడిపికి తెలిసిపోతాయని జగన్ వద్దకు మేటర్ వెళ్ళటంతో, జగన్ అందరినీ తన మాట ఎందుకు వినలేదో చెప్పాలి అంటూ, తాను అమెరికా వెళ్ళే లోపు సంజయషీ చెప్పాలని, చెప్పినట్టు సమాచారం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read