ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ కూర్పు దాదపుగా తుది దశకు వచ్చేసింది. అయితే ముందు చెప్పినట్టుగా, మొత్తం మంత్రులు అందరినీ తొలగిస్తారని ప్రాచారం జరిగినా, వైసీపీ సీనియర్ మంత్రుల నుంచి వచ్చిన బెదిరింపులతో జగన్ మోహన్ రెడ్డి వెనక్కుతగ్గారు. దాదాపుగా ఆరు నుంచి పది మంది వరకు, పాత మంత్రులే కొనసాగుతారని తెలుస్తుంది. ముఖ్యంగా ఇద్దరు సీనియర్ మంత్రులు, వైసీపీని చీల్చే పనిలో ఉన్నారని సమాచారం అందటం, ఒక మంత్రి ఏకంగా ఢిల్లీ వెళ్లి రావటంతో, ఒక్కసారిగా జగన్ ఉలిక్కిపడ్డారు. అయితే, పాత మంత్రుల కొనసాగింపుతో, ఇప్పుడు ఆశావాహులు తమకు మంత్రి పదవి రావటం లేదు అనే అసంతృప్తిలో ఉన్నారు. మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాలో, విడదల రజినీకి మంత్రి పదవి రావటంతో, అక్కడ ఆమె వ్యతిరేకత వర్గం సమావేశం అయ్యింది. ఆమెకు మంత్రి పదవి ఇస్తే, తాము వైసీపీకి రాజీనామా చేస్తామని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు బెదిరిస్తున్నారు. ఇక పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి వర్గీయలు కూడా ఆందోళనకు దిగారు, పిన్నెల్లికి మంత్రి పదవి ఇవ్వకపోతే చూస్తూ ఉండటం అంటూ బెదిరిస్తున్నారు. మరో పక్క తాజా మాజీ మంత్రి బాలినేనికి హైబీపీ వచ్చినట్టు తెలుస్తుంది. బాలినేని తనను మంత్రిగా కొనసాగనిస్తారని భావించినా, ఆయనకు పదవి ఇవ్వలేదని తెలుస్తుంది.

jagan 10042022 2

ఇప్పటి వరకు వచ్చిన సమాచారం ప్రకారం, పది మంది పాత మంత్రులను కొనసాగిస్తారని తెలుస్తుంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం, బొత్స సత్యనారాయణ, రాజన్నదొర, ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, భాగ్యలక్ష్మి, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, చిట్టి బాబు, వేణుగోపాల్, కారుమూరి నాగేశ్వరరావు, గ్రంధి శ్రీనివాస్, జోగి రమేష్, కొడాలి నాని, రక్షణనిధి, విడదల రజనీ, మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, కాకాని గోవర్థన్ రెడ్డి,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ బాషా, కొరుముట్ల శ్రీనివాస్, శిల్పా చక్రపాణి రెడ్డి, గుమ్మనూరు జయరాం, జొన్నలగడ్డ పద్మావతి, శంకర్ నారయణ. ఈ మంత్రులు ఉన్నారు. వైసీపీలో చెలరేగిన ఈ అసంతృప్తులు ఎంత వరకు వెళ్తాయో చూడాలి. మాచర్ల నియోజకవర్గంలో ప్రజాప్రతినిధుల భేటీ అయ్యి, పిన్నెల్లికి మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తామన్న ప్రజాప్రతినిధులు బెదిరిస్తున్నారు. మాచర్ల మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్ల సమావేశం అయ్యారు. మాచర్ల ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచుల సమావేశం అయ్యారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read