రాష్ట్రంలో రూ.1000 కోట్లతో చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాలతో సహా మరో రెండు చోట్ల హింద్‌వేర్‌ తయారీ ప్లాంట్లను స్థాపిస్తామంటూ ఆ సంస్థ ఎండీ సందీప్‌ సొమానీ వెల్లడించారు. ఈడీబీ సీఈవో కృష్ణ కిశోర్‌తో కలసి సీఎం చంద్రబాబుతో బుధవారం భేటీ అయ్యారు. శానిటరీవేర్‌ తయారీకి సంబంధించిన ప్లాంట్లను చిత్తూరు, పశ్చిమగోదావరి జిల్లాలలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. మరో రెండుచోట్ల కూడా ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అధ్యయనం చేస్తున్నామని వివరించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1500 కోట్లతో ఫైబర్‌ బోర్డు, సిరామిక్‌ యూనిట్లు నెలకొల్పుతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థ (ఈడీబీ) ముఖ్య కార్యనిర్వాహణాధికారి కృష్ణకిశోర్‌, రాష్ట్ర ప్రణాళికా మండలి ఉపాధ్యక్షుడు కుటుంబరావు, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్‌, అదనపు కార్యదర్శి రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.

hindware 23082018 2

మరో పక్క, రూ.2500 కోట్లతో కృష్ణపట్నంలో పెట్రో కెమికల్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటు కానుంది. దక్షిణ కొరియాకు చెందిన దిగ్గజ సంస్థ తన వ్యాపార విస్తరణలో భాగంగా దీనిని ఏర్పాటు చేయనుంది. విశాఖలో ఇప్పటికే ఒక యూనిట్‌ కలిగిన ఎల్‌జీ కెమ్‌ కృష్ణపట్నంలో ఏబీఎస్‌ ప్లాస్టిక్‌ మెటీరియల్‌ ప్లాంట్‌ను నిర్మించనుంది. సంస్థ భారత్‌ హెడ్‌, మేనేజింగ్‌ డైరెక్టరు హావార్డ్‌ చుంగ్‌, ఎల్‌జీ పాలిమర్స్‌ డైరెక్టరు యంగ్‌ మొజుంగ్‌ తదితరులు బుధవారం రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలో కలిశారు.

hindware 23082018 3

ఈ సందర్భంగా వ్యాపార విస్తరణ ప్రణాళికలను వారు ముఖ్యమంత్రివద్ద ఉంచారు. స్పందించిన సీఎం... ఎల్‌జీ కెమ్‌కు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, శ్రీసిటీ సహా ఇతర ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు మిత్సుబిషీ పరిశీలిస్తోంది. ప్రత్యేక బృందం మరో రెండురోజులపాటు రాష్ట్రంలో పర్యటిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. అలాగే, జిప్‌ తయారీ రంగంలో జపాన్‌ దిగ్గజ సంస్థ వైకేకే రూ.వెయ్యి కోట్లతో పరిశ్రమను స్థాపించేందుకు ఆసక్తి ప్రదర్శిస్తోంది. ఈ సంస్థ ప్రతినిధులు కూడా సీఎంతో భేటీ అయ్యారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read