వైసీపీలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. టిడిపి నుంచి నలుగురు ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి వారితోనే టిడిపిపై దాడి చేయించిన వైసీపీ ఇప్పుడు తమ సొంత పార్టీ ఎమ్మెల్యేలపై అనుమానపు చూపులు చూస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి క్రాస్ ఓటింగ్ భయం పట్టుకుంది. హోటళల్లో క్యాంపులు, ఎమ్మెల్యేల వెంట నిఘా పోలీసులు తిరుగుతున్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఏడు స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో టీడీపీ తమ అభ్యర్థిగా పంచుమర్తి అనూరాధని దింపడంతో వైసీపీ ఒక్కసారిగా అలెర్ట్ అయ్యింది. వాస్తవంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ గెలవడానికి 22 మంది ఎమ్మెల్యేలు అవసరం. టిడిపి తరఫున 23 మంది గెలిచినా, అందులో నలుగురిని వైసీపీ కొనుగోలు చేసింది. గతంలో టిడిపిలో వైసీపీ ఎమ్మెల్యేలు చేరిన సందర్భంగా సంతలో పశువులను కొన్నట్టు కొన్నారని ఆరోపించిన వైఎస్ జగన్ అలాగే టిడిపి ఎమ్మెల్యేలను పశువుల్లా కొన్నాడు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎవరైనా టిడిపి ఎమ్మెల్యేలు తన పార్టీలో చేరాలనుకుంటే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలంటూ బల్లగుద్ది మరీ చెప్పారు. అయితే నలుగురు టిడిపి ఎమ్మెల్యేలు రిజైన్ చేయకుండానే వైసీపీలో కొనసాగుతున్నారు. వైసీపీ మార్క్ పాలిటిక్స్‌కి ఝలక్ ఇవ్వడానికి టిడిపి సిద్ధం అవుతోంది.
ఎమ్మెల్యే కోటా ఎన్నికలని ప్రతిష్టాత్మకంగా తీసుకుని వైసీపీ కన్నింగ్ పాలిటిక్స్‌కి చెక్ పెట్టాలనుకుంటోందది. దీంతో అప్రమత్తమైన అధికార వైసీపీ తమ ఎమ్మెల్యేలపై నిఘా పెట్టింది. ఇప్పటికే ఇద్దరు ఆత్మప్రభోదానుసారం పాట పాడుతున్న నేపథ్యంలో మరి ఒక్కరు ఓటేస్తే చాలు. ఆ ఒక్కరు ఎవరో తెలియక మొత్తం 150 మంది, టిడిపి నుంచి చేరిన నలుగురు, జనసేన నుంచి వచ్చిన ఒక్కరిపైనా అనుమానపు చూపులు చూస్తోంది. అంటే జగన్ రెడ్డి ఒక్కడు తప్పించి, మిగిలిన ఏ ఒక్కరినీ నమ్మడంలేదని అర్థం అవుతోంది. డౌట్ పడుతున్న కొంతమంది ఎమ్మెల్యేలతో సీఎం జగన్ నేరుగా మాట్లాడారు. ఎమ్మెల్యేలతో ఓటు వేయించే బాధ్యతను సీనియర్ నేతలకు అప్పగించేశారు. ఒక్కో ఎమ్మెల్యే సమన్వయానికి ఏడుగురు సీనియర్ నేతలకు బాధ్యతలు కేటాయించారు. 22 మంది ఎమ్మెల్యేలను సమన్వయం చేసేందుకు పార్టీ సీనియర్ నేతలతో పాటు కొందరు మంత్రులకు అప్పగించేశారు. వీరందరితో క్యాంప్ రాజకీయాలు, విందు భోజనాలు ఏర్పాటు చేశారు