కేంద్రంలోని బీజేపీ చేస్తున్న అన్యాయం పై, రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ఆందోళన బాట పట్టిన సంగతి తెలిసిందే... రాష్ట్రంలో సామాన్య ప్రజల దగ్గర నుంచి, పార్లమెంట్ లో ఆందోళన దాకా, అన్ని విధాలుగా, కేంద్రం పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు... ఎవరికీ తోచిన విధంగా, వారు కేంద్రం పై ఆందోళన చేస్తున్నారు... కొంత మంది అయితే, ఎంతో వినూత్నంగా ఆందోళనలు చేస్తున్నారు... ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే, ఎక్కడ రాష్ట్రానికి నష్టం లేకుండా, ఎక్కువ గంటలు పని చేసి, జపాన్ తరహా ఆందోళనకు పిలుపిచ్చారు... ఎన్ని చేస్తున్నా కేంద్రం మాత్రం దిగి రావటం లేదు అనుకోండి...
అయితే, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో వినూత్నంగా ఆందోళన చేసారు... మట్టి కుండలతో రైతులు భారీ నిరసన పదర్శన చేశారు. ‘మోదీ గారు మీ మట్టి.. మీ నీరు మాకొద్దు ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు కావాలి’ అనే నినాదంతో గాంధీబొమ్మ నుంచి పోస్టాఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు... ర్యాలీ అయిపోయిన తరువాత, మట్టి కుండలను మోదీకి రామానాయుడు పార్సిల్ చేశారు. ఏపీకి పత్యేక హోదా ఇస్తామన్న మోదీ.. నీరు, మట్టి ఇచ్చి చేతులు దులుపుకున్నారని రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు...
గత కొన్ని రోజులుగా అసెంబ్లీ జరుగుతూ ఉండటంతో, ఎమ్మల్యేలకు ఆందోళన చేసే అవకాసం రాలేదు.. గురువారం నుంచి సెలవలు ఉండటంతో, ఎమ్మల్యేలు అందరూ అమరావతి నుంచి సొంత నియోజకవర్గాలకు వెళ్లారు.. ఈ నేపధ్యంలో, ప్రజల్లో కేంద్రం పై ఆగ్రహం ఉన్న నేపధ్యంలో, ప్రజలతో కలిసి, కేంద్రం పై అనేక చోట్ల నిరసన ప్రదర్శనలు చేసారు... ఈ నేపధ్యంలో, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మట్టి కుండలను మోదీకి పార్సిల్ చేసి, వినూత్నంగా ఆందోళన జరిపారు...